Breaking News

17/12/2019

అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ:మంత్రి ఎర్రబెల్లి

భూపాలపల్లి డిసెంబర్ 17 (way2newstv.in)
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పల్లె ప్రగతితో తెలంగాణ రాష్ట్రం పారిశుధ్యంలో ఉత్తమ అవార్డుకు ఎంపికైందని చెప్పారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. సీఎం కేసీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. అసాధ్యమనుకున్న తెలంగాణను కేసీఆర్ తన ఉద్యమ పటిమతో సాధించారన్నారు. తెలంగాణ జీవధార అయిన కాళేశ్వరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసి గ్రామాలను సస్యశ్యామలం చేశారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లి అడ్డుంకులు సృష్టించినా.. వాటన్నింటినీ ఎదుర్కొని కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. 
అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ:మంత్రి ఎర్రబెల్లి

మిషన్ భగీరథ పథకంతో గ్రామాలకు మంచినీటిని అందిస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ విధానాలతో రైతులకు, వ్యవసాయం చేసే వారికి గుర్తింపు లభించిందన్నారు. పేదలు, వృద్ధులు, ఒంటరి మహిళలు, నేత-గీత కార్మికులకు ఆసరా పథకంతో అండగా ప్రభుత్వం నిలిచిందన్నారు. సర్పంచ్ పదవి చాలా గొప్పదని, మంచి పేరు తెచ్చుకునేలా పని చేయాలని సర్పంచ్‌లకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వాహణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎవరైనా గీత దాటితే జరిమానాలు విధించాలన్నారు. సర్పంచ్‌లు గ్రామాలను పరిశుభ్రంగా, పచ్చదనంతో నింపాలని దిశానిర్దేశం చేశారు. ఉపాధి హామీ పథకంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. గ్రామాల్లో పనులు కొనసాగేందుకు అవసరమైన నిధులు ఉన్నాయని చెప్పారు. జనవరి 2 నుంచి 11 వరకు పల్లె ప్రగతి రెండో దశ మొదలు కానుందని మంత్రి దయాకర్ తెలిపారు. ప్రతి సర్పంచ్ దీనిని సవాల్‌గా తీసుకుని పల్లె ప్రగతిని విజయవంతం చెయ్యాలన్నారు. అభివృద్ధి చెందిన గ్రామాలకు ప్రత్యేక ప్రోత్సాహకం ఉంటుందని చెప్పారు

No comments:

Post a Comment