Breaking News

31/12/2019

ఢిల్లీ ఎన్నికల్లో కీలకంగా మారనున్న దిశ చట్టం?

న్యూ ఢిల్లీ డిసెంబర్ 31  (way2newstv.in)
వచ్చే రెండు లేదా మూడు నెలల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో కొనసాగుతోంది. అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఈ సారి కూడాబీజేపీని ప్రతిపక్ష స్థానానికి మాత్రమే పరిమతం చేయడానికి వ్యూహాలను రచిస్తోంది. ఇందులో భాగంగానే ..ఎన్నికల ప్రచారంలో మళ్లీ అధికారం లోకి వస్తే ఏపీ లో అమల్లోకి వచ్చిన దిశ చట్టాన్ని ఢిల్లీ లో అమలు చేస్తామనే హామీని ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.ఏపీ దిశ చట్టాన్ని అమలు చేస్తామనే విషయాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మార్చుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ మేనిఫెస్టో కమిటీ అభిప్రాయపడుతున్నట్లు చెబుతున్నారు. ఇదే అంశాన్ని మేనిఫెస్టోలో పొందుపర్చాలని దీనికి ప్రాధాన్యత ఇవ్వాలని వారు నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. 
ఢిల్లీ ఎన్నికల్లో కీలకంగా మారనున్న దిశ చట్టం?

దేశ రాజధానిలో అత్యాచారాల రేటు అధికం గా ఉండటం వల్ల.. ఎట్టి పరిస్థితుల్లోనూ దిశ చట్టానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. అత్యాచారాలకు అడ్డుకట్ట వేయడానికి ఏపీ దిశ చట్టం అత్యద్భుతం గా పనిచేస్తుందనే అభిప్రాయం ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్లో వ్యక్తమౌతోంది. ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడం ద్వారా మహిళల పై నేరాలను నియంత్రించ వచ్చని ఇదే విషయంపై ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తున్నారు. దీనితో మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన కిరాతకులకు మూడు వారాల్లోనే ఉరిశిక్షను విధించడానికి న్యాయవ్యవస్థల ద్వారా అవసరమైన చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ ఏపీ దిశ చట్టానికి రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల కిందటే ఈ చట్టానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమల్లోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. మహిళల కోసం ఈ తరహా చట్టాన్ని తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందింది ఆంధ్రప్రదేశ్.దిశ చట్టంపై దేశం లోని పలు రాష్ట్రాలు ఆసక్తి చూపాయి. కామాంధులకు 21 రోజుల్లోనే ఉరిశిక్ష ను అమలు చేయడానికి ఢిల్లీ ఒడిశా కేరళ ప్రభుత్వాలు వైఎస్ జగన్ ను అభినందిస్తూ తమ సందేశాలను పంపించాయి. ఈ చట్టానికి సంబంధించిన ప్రతులను తెప్పించుకున్నాయి. వాటిపై అధ్యయనం చేస్తున్నాయి. తమ రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలు చేయడానికి గల సాధ్యసాధ్యాలను కూడా పరిశీలిస్తున్నాయి. హైదరాబాద్ నగర శివార్ల లో వెటర్నరీ డాక్టర్ దిశని అత్యంత క్రూరంగా అఘాయిత్యం చేసి హత్య చేసిన ఘటన అందరికి తెలిసిందే.

No comments:

Post a Comment