Breaking News

31/12/2019

పారదర్శకంగా,ప్రశాంతవాతావరణంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సహకరించాలి :

కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి శ్రీ కృష్ణ భాస్కర్
మున్సిపల్ ఎన్నికలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో   కలెక్టర్  భేటీ
ఎన్నికల ప్రవర్తన నియమావళి తప్పనిసరిగా పాటించాలి
సిరిసిల్ల డిసెంబర్ 31  (way2newstv.in)
జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా , సజావుగా జరిగేలా  అన్నీ రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి  కృష్ణ భాస్కర్ కోరారు .మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కలెక్టరేట్ మీటింగ్ హాల్ నందు మంగళవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో జిల్లా కలెక్టర్  భేటీ అయ్యారు.
సంయుక్త కలెక్టర్  యాస్మిన్ భాష ,  డీఆర్వో  ఖీమ్యా నాయక్ , మున్సిపల్ కమిషనర్ లు  సమ్మయ్య , ప్రవీణ్ కుమార్ , తదితరులు ఈ సమావేశంకు హాజరయ్యారు .మున్సిపల్‌ ఎన్నికల డ్రాఫ్ట్‌ ఓటరు జాబితా పబ్లికేషన్‌, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నియమాలపై కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహనా కల్పించారు .
పారదర్శకంగా,ప్రశాంతవాతావరణంలో  మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సహకరించాలి : 

ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాను డిసెంబర్ 30 న ప్రకటించామని ఆయన తెలిపారు.  ఓటర్ల జాబితాలో ఏమైన అభ్యంతరాలు ఉంటే జనవరి 2 వరకు తెలపాలని రాజకీయ పార్టీలకు సూచించారు. రాజకీయ పార్టీలు తెలిపిన అభ్యంతరాలను జనవరి 3 న  పరిశీలించి, పరిష్కరిస్తామని తెలిపారు. జనవరి 4 న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే జనవరి 4 న పోలింగ్ స్టేషన్ల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకటిస్తామని తెలిపారు. అభ్యంతరాలుంటే జనవరి 8 వరకు తెలపాలని వాటిని పరిశీలించి జనవరి 13 న తుది పోలింగ్ స్టేషన్ల జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జనవరి 7 న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారి చేస్తుందని తెలిపారు. రిజర్వేషన్లకు సంబంధించి జనవరి 5 నాడు ప్రకటిస్తామని కలెక్టర్ తెలిపారు. జనవరి 8 నుండి  10 వ తేది వరకు నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. నవంబర్ 11 న స్క్రూటిని ఉంటుందని, జనవరి 12 న అప్పీలు చేసుకోవచ్చని తెలిపారు. జనవరి 13 న పరిశీలించి పరిష్కరిస్తామని తెలిపారు. నామినేషన్ల విత్ డ్రాలు జనవరి 14 వరకు చేసుకోవచ్చని తెలిపారు. జనవరి 14 న పోటిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని కలెక్టర్ తెలిపారు. జనవరి 22 న మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు .జనవరి 25 న ఓట్ల లెక్కింపు ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఓట్ల లెక్కింపు తర్వాత ఫలితాలను ప్రకటిస్తామని  కలెక్టర్ తెలిపారు .మున్సిపల్ ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరపనున్నామని తెలిపారు . మున్సిపల్ ఎన్నికల బ్యాలెట్ పత్రాలపై అభ్యర్థుల పేర్లతో పాటు సంబంధిత పార్టీల గుర్తులు కూడా ముద్రిస్తామని కలెక్టర్  తెలిపారు. అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తరువాతే బ్యాలెట్‌ పత్రాలు ముద్రిస్తామన్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు .పోటిలో ఉన్న అభ్యర్థులకు వాహనాల పర్మిషన్, మీటింగ్ లకు అనుమతి సంబంధిత మున్సిపల్ కమీషనర్లు ఇస్తారని తెలిపారు. మైక్ పర్మీషన్లు పోలిస్ శాఖ ఇస్తుందని తెలిపారు.మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల రోజు నుండే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందన్నారు , మున్సిపాలిటి పరిధిలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు అవుతుందన్నారు . అన్ని రాజకీయ పార్టిలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు.    ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు అడిగిన సమస్యలకు సమాధానాలు ఇచ్చారు. సందేహాలను నివృత్తి చేసారు .

No comments:

Post a Comment