Breaking News

04/12/2019

ఇసుక రవాణా దారులతో మంత్రి నాని భేటీ

గుడివాడ డిసెంబర్ 4, (way2newstv.in)
ఇసుక రవాణా చేస్తున్న యజమానులతో రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి  వెంకటేశ్వరరావు( నాని) బుధవారం సమావేశం అయ్యారు. మంత్రి మాట్లాడుతూ ఇసుక రవాణా చేస్తున్న ప్రతి వాహనానికి జిపియస్ ను ఎర్పాటు చేసుకోవాలి. దీనికి యజమానులు సహకరించాలి. ఇసుకను అక్రమ రవాణా చేస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వానికి లారీ యజమానులు సహకరించాలి. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టి కి తీసుకు రండని సూచించారు. ఇసుక రవాణా నిబంధనలకు లోబడి ఇసుకను రవాణా చేసే వాహనాల యజమానులపై ఎటువంటి వేధింపులు ఉండవు. 
ఇసుక రవాణా దారులతో మంత్రి నాని భేటీ

ఇసుక రవాణాలో ఎదురవుతున్న సమస్యలను ట్రాక్టరు, లారీ యజమానులు మంత్రికి వివరించారు. మంత్రి స్పందిస్తూ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అయన తనయుడు లోకేష్ ఆద్వర్యంలో మంత్రులు ,శాసన సభ్యులు ఇసుక అక్రమంగా తరలించి వేలాది కోట్లు అవీనితి చేశారని, దానికి నిదర్శనం గత ప్రభుత్వం నదీ గర్భం ఇసుకను అక్రమంగా తీసిందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూ.100 కోట్లు జరిమానా విధించిదని గుర్తు చేశారు.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఎటువంటి అవినీతి లేకుండా ఇసుకను ప్రజలకు అందించాలని పాలసీ మార్చి ఇప్పుడు ప్రజలకు అందిస్తున్నారని అన్నారు. ఇప్పుడు చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ ,తెలుగుదేశం పార్టీ నాయకులు ఇసుకను జాతీయ సమస్య గా చిత్రికరించి రాజకీయ లబ్దిపొందాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మా ప్రభుత్వం లో నాతో సహ కొంత మంది మీద తెలుగుదేశం పార్టీ ఇసుక చార్జీషీట్ అని వేశారు.గతంలో వారు దోపిడీ చేసినట్లు అందరూ అదేవిధంగా దోచుకుంటారని వారు ఊహించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి  ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలకు అదేశాలు జారీ చేశారు.  దేవుడు దయవలన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం నుండి నాలుగు నెలలు వరదలు రావడంతో సుమారు 10కోట్ల టన్నులు ఇసుక మేటలు నదిలో చేరినట్లు అధికారులు అంచనా వేశారు.  రాబోయే పది సంవత్సరాల వరకు ఇసుకకు ఈ రాష్ట్రంలో కోరత ఉండకపోవచ్చని మంత్రి తెలిపారు.కాబట్టి ఇసుక కావలసిన వారు గతంలో టోకెన్ తీసుకున్న తరువాత 14 రోజులు చెల్లుబాటు అయ్యేదని, దానిని ఇప్పుడు మార్చి టోకెన్ తీసుకున్న 48 గంటల్లోనే వారు స్టాక్ పాయింట్ నుండి ఇసుకను తీసుకుని వెళ్ళాలని అందుకు ట్రాక్టర్, లారీ యజమానులు అందరూ సహకరించాలని మంత్రి కోరారు.

No comments:

Post a Comment