Breaking News

04/12/2019

కాటారం రోడ్డును పరిశీలించిన ఎమ్మెల్ఏ శ్రీధర్ బాబు

జయశంకర్ భూపాలపల్లి డిసెంబర్ 4, (way2newstv.in)
బుధవారం ఉదయ్ం  కాటారం నుండి పెద్దపల్లి వరకు  ధ్వంసం అయిన రోడ్డు ను మంథని ఎమ్మెల్యే   శ్రీధర్ బాబు పరిశీలించారు. తరువాత అయన రహదారులు, భవనాల శాఖ  అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంథని నియోజక వర్గం లో ధ్వంసం అయిన రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలేదనీ,ఈ రోడ్డు పై ద్విచక్ర వాహనాలు నడిచే పరిస్థితి లేదన్నారు. 
కాటారం రోడ్డును పరిశీలించిన ఎమ్మెల్ఏ శ్రీధర్ బాబు

వెంటనే ప్రభుత్వం రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని , ఇసుక మాఫియా ఓవర్ లోడ్ పై మానిటర్ చేయాలని, రాబోయే రెండు నెలల్లో మేడారం జాతర ఉంటుంది అని, దానిని దృష్టి లో పెట్టుకొని త్వరగా మరమత్తులు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ  నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment