వై జె సి రవి పట్టన్ షెట్టి
ఎమ్మిగనూరు డిసెంబర్ 21 (way2newstv.in):
ఎమ్మిగనూరు పట్టణంలో శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం సందర్భంగా , డిసెంబర్ 21: నేతన్న నేస్తం పథకం కింద మగ్గాలు ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ. 24000 ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు జెసి పట్టన్ శెట్టి తెలిపారు. ఎమ్మిగనూరు తీరు బజారులో జిల్లా చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. జె సి రవి పట్టన్ షెట్టి, యమ్ యల్ ఎ కె.చెన్న కేశవ రెడ్డి, ఆదోని ఆర్టివో బాల గణేశాయ, సహాయ సంచాలకులు చేనేత మరియు జౌళి శాఖ వెంకటేశ్వర్లు, ఏమిగునూరు కమిషనర్ రఘునాథ్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
జిల్లాలో నేతన్న నేస్తం 3,998 కుటుంబాలకు రూ.9,59,52,000 కోట్లు నగదు జమ
ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ జిల్లాలో నేతన్న నేస్తం 3,998 కుటుంబాలకు రూ.9,59,52,000 కోట్లు నగదు జమ జరిగిందన్నారు. ఎవరికైనా నగదు జమ కాకపోయినా తమ పేర్లు లేకపోయినా వెంటనే వివరాలు చేనేత మరియు జౌళి శాఖకు అందజేస్తే న్యాయం చేస్తామన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు చేనేత వస్త్రానికి పేరు పెట్టిందని, ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 1992 మంది లబ్ధిదారులు ఉన్నారన్నారు. ఈ ప్రాంతంలో వైయస్సార్ నేతన్న పథకం కార్యక్రమానికి హాజరు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఎమ్మిగనూరు శాసనసభ్యులు కె. చెన్నకేశవ రెడ్డి మాట్లాడుతూ జగనన్న పుట్టినరోజు వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అనేక సంక్షేమం పథకాలను ప్రవేశపెట్టిన ఘనత జగన్ కి దక్కుతుందన్నారు.
No comments:
Post a Comment