Breaking News

21/12/2019

గేదెలను తోలుకొని రోడ్లపైకి వచ్చి బంద్

పాట్న డిసెంబర్ 21 (way2newstv.in):
: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శనివారం బంద్ కు పిలుపుఇచ్చిన రాష్ట్రీయ జనతాదళ్ కార్యకర్తలు జాతీయ రహదారులపైకి గేదెలను తోలుకువచ్చి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. బీహార్ రాష్ట్రంలోని దర్బంగా, వైశాలీ నగరాల్లో ఆర్జేడీ కార్యకర్తలు శనివారం ఉదయం గేదెలను తోలుకొని రోడ్లపైకి వచ్చి బంద్ చేయించారు. 
గేదెలను తోలుకొని రోడ్లపైకి వచ్చి బంద్

జాతీయ రహదారులపై టైర్లు కాల్చి, గేదెలను అడ్డంగా నిలిపివేయడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. కార్యకర్తలు చొక్కాలు విప్పేసి నితీష్ కుమార్, కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దర్బంగా రైల్వేస్టేషను వద్ద నిరసనకారులు రైళ్ల రాకపోకలను సైతం అడ్డుకున్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బీహార్ బంద్ లో పాల్గొనాలని ఆర్జేడీ నాయకుడు తేజస్వీయాదవ్ కోరారు. పెద్దసంఖ్యలో గేదెలు రోడ్లపైకి రావడంతో వాహనాల రాకపోకలకు బ్రేక్ పడి బీహార్ బంద్ విజయవంతం అయింది.

No comments:

Post a Comment