హైదరాబాద్ డిసెంబర్ 21 (way2newstv.in):
;కేంద్ర పారిశ్రామిక భద్రతా దళానికి చెందిన ఫైర్ సర్వీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్ఎస్టిఐ), ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ 28 వ బ్యాచ్ కానిస్టేబుల్ / ఫైర్ బేసిక్ కోర్సు కు చెందిన 604 మంది ట్రైనీల పాసింగ్ పరేడ్ హకీంపేటలో జరిగింది. జాతీయ పారిశ్రామిక భద్రతా అకాడమీ (నిసా) డైరెక్టర్ అంజనా సిన్హా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని దీక్షాంత్ పరేడ్‌ను సమీక్షించారు.అంజనా సిన్హా మాట్లాడుతూ, సిఐఎస్ఎఫ్ దేశ ప్రధాన భద్రతా దళం అని ,సిఐఎస్ఎఫ్ అద్భుతమైన గతాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకొన్నారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలు (సిఐఎస్ఎఫ్) క్లిష్ట పరిస్థితులలో అద్భుతమైన సేవలు అందించాయని, భద్రతా దళాలు అందిస్తోన్న సేవలు, వారి కార్యదీక్ష పట్ల ఆమె సంతృప్తిని వ్యక్తం చేశారు.
భద్రతా దళాలు అందిస్తోన్న సేవలు అజరామమం: అంజనా సిన్హా
2017 సంవత్సరంలో ఎఫ్‌ఎస్‌టిఐకి అత్యుత్తమ ఇండియా నైపుణ్యం, ప్రతిభ (ఫిస్ట్) అవార్డును ఫైర్ అండ్ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రదానం చేసినట్లు సిన్హా గుర్తు ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారత రాజ్యాంగం, సిఐఎస్ఎఫ్ వారసత్వాన్ని సమర్థవంతంగా కాపాడాలని, శిక్షణ పొందినవారు తమ విధులను భక్తి, చిత్తశుద్ధితో నిర్వహించాలని ఆమె వారికి సూచించారు.పారిశ్రామిక భద్రతా నిర్వహణ రంగంలో ఉత్తమ కేంద్రంగా నిసా అకాడమీని భారత ప్రభుత్వం గుర్తించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. శిక్షణా సంస్థ ప్రిన్సిపాల్ మరియు డి.ఐ. జి ఎస్.కె మల్లిక్ మాట్లాడుతూ అకాడమీ శిక్షణా కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. అకాడమీలో ఇచ్చే కఠినమైన శిక్షణ వారిని వృత్తి జీవితంలో గొప్ప స్థానంలో నిలిచేలా ఉపయోగపడుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. శిక్షణా కార్యక్రమంలో ప్రతిభను ప్రదర్శించిన వారికి సిన్హా బహుమతులు ప్రధానం చేశారు.ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ సిబ్బంది మాక్ డ్రిల్‌లో మంటలను ఆర్పే వ్యూహాత్మక పద్ధతులను ఈ సందర్భంగా ప్రదర్శించారు. అగ్ని ప్రమాదాలను నివారించేటప్పుడు అనుసరించే, ప్రాణాలను రక్షించే పద్ధతుల శ్రేణిని బ్రిగేడ్ ప్రదర్శించింది. అగ్నిమాపక పోరాటం, పలు రోప్ రెస్క్యూ పద్ధతులు (కెమికల్ బయోలాజికల్, రేడియో న్యూక్లియర్) మొదలైన వాటిపై సిఐఎస్ఎఫ్ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాయి
No comments:
Post a Comment