Breaking News

13/11/2019

ఓటర్ జాబితా స్పష్టంగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలి

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్
హైదరాబాద్ నవంబర్ 13, (way2newstv.in)
 ఓటర్ జాబితాలో తప్పులు లేకుండా స్పష్టంగా ఉండేందుకు ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని విజయవంతానికి కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ అన్నారు.బుధవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ ఓటర్ వెరిఫికేషన్ లో భాగంగా ఓటర్ జాబితా స్పష్టంగా పటిష్టంగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని అయన సూచించారు.  రేషనలైజేషన్ చేసిన పోలింగ్ స్టేషన్ వారీగా  నక్షా తయారు చేసి, ఆ నక్ష ప్రకారంగా ఒక పోలింగ్ కేంద్రంలో ఎన్ని గృహాలు ఉన్నాయో వాటిని గుర్తించి,  ఓటర్ల కోసం పాలి గాన్ (నక్ష మాదిరి) తయారుచేసుకుని అందులో గల ఓటర్ల వివరాలను నమోదు చేయాలని,  ముందుగా ఇంటి నెంబర్ తరువాత ఎపిక్ నెంబర్ నమోదు చేయాలన్నారు.  
ఓటర్ జాబితా స్పష్టంగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలి

ఇప్పటి వరకు జరిగిన ఓటర్ వెరిఫికేషన్ లో ప్రగతి పర్సంటేజ్ ముఖ్యం కాదని నాణ్యత ముఖ్యమని చెప్పారు. బిఎల్ వో లు నమోదు చేసిన వివరాలు ఈ ఆర్ ఓ పరిశీలన చేయవచ్చునని ,  డాష్ పోర్టు వెబ్సైట్  లో పోలింగ్  స్టేషన్లో ఓటర్ల నమోదు పక్రియ తెలుసుకోవచ్చునని అన్నారు. ఈ ప్రక్రియలో ప్రేత్యేక అధికారిగా,  సీనియర్ అధికారిని నియమించి ఈ ప్రక్రియ సమర్థవంతంగా వేగవంతంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని సీఈవో కలెక్టర్ల కు సూచించారు.  ఈ ప్రక్రియలో బూత్ లెవల్ అధికారుల పాత్ర కీలకమని అన్నారు. నూతన ఓటర్లుగా నమోదు చేసుకున్న వారందరిని పరిశీలన చేసి అర్హతగల వారికి నమోదు ఎపిక్ కార్డు జారీ చేయాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.  నియోజకవర్గం వారిగా పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, ఓటర్ జాబితాలో డూప్లికేట్ ఫోటో( డెమో లాజికల్ సిమిలర్ ఎర్రర్స్( డి ఎస్ సి))  అదేవిధంగా లాజికల్ ఎర్రర్స్ లేకుండా సరిచేయాలని సి ఈ ఓ కలెక్టర్లను కోరారు.

No comments:

Post a Comment