Breaking News

13/11/2019

చాపకింద నీరులా ఫ్లోరైడ్

ఖమ్మం, నవంబర్ 13, (way2newstv.in)
జిల్లాలో ఫ్లోరైడ్‍ చాపకింద నీరులా విస్తరిస్తోంది . సాధారణంగా బావులు, చేతి పంపుల నీరు సురక్షితమైనదని అధికారులు పేర్కొంటుంటారు. భూమి లోపల నుంచి ఉబికి వస్తున్న నీరు శుభ్రమైనదిగా ప్రజలు భావిస్తారు. కానీ భూగర్భ జలాలే విషంగా మారుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నైట్రైట్స్, రెసిడ్యూస్‍ సోడియం కార్బొనేట్‍ శాతం నిర్దేశించిన దానికన్నా ఎక్కువగా నమోదవుతోంది.పారిశ్రామిక ప్రాంతమైన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో భూగర్భ జలాలు విషపూరితంగా మారుతున్నాయి. ఇటీవల హెచ్‍ఆర్ సీ ఆదేశాలతో భూగర్భ జలాలపై ఆ శాఖ జిల్లాల్లో ని పలు ప్రాంతాల్లో పరిశీలన చేసింది. ఈ సందర్భంగా విస్మయం కలిగించే అంశాలు వెల్లడయ్యాయి. జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, సారపాక, మణుగూరు ప్రాంతాల్లో భూగర్భ జల కాలుష్యం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 
చాపకింద నీరులా ఫ్లోరైడ్

ఇప్పటివరకు జిల్లా ప్రజలు వాయు కాలుష్యంతోనే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు జలం కాలుష్యంతో మరో ముప్పు ప్రజల ముంగిటకు వచ్చింది. టేకులపల్లి మండలం ముత్యాలంపాడు, మణుగూరు, ఇల్లెందుమండలంలో సుదిమళ్ల, కొమరారం, నారాయణపురం, పాల్వంచ మండలంలో యానంబైలు, అశ్వారావ్ పేట మండలంలో గుమ్మడివల్లి, అశ్వాపురం, కొత్తగూడెం మండలంలో బంగారుచెలక, దుమ్ముగూడెం మండలంలో నర్సాపురం, కరకగూడెం మండలంలో కలవల నాగారాం , చర్ల, చండ్రుగొండ మండలంలో గుంపెన, జూలూరుపాడు మండలంలో గుండెపుడి, గుండాల, బూర్గంపాడు మండలంలో మోరంపల్లి బంజర తదితర ప్రాంతాల్లో ఫ్లోరైడ్‍ శాతం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.జిల్లాలోని 103 గ్రామాల్లో పరిశీలిం చగా 17 ప్రాంతాల్లో ఫ్లోరైడ్‍ శాతం ఎక్కువగా ఉందని తేలింది.సాధారణంగా ఉండే దానికన్నా 1.52 నుంచి 4.60 పీపీఎం ఎక్కువగా ఉంది. ఫ్లోరైడ్‍ వల్ల ఫ్లోరోసిస్‍,దంత సమస్యలు, ఎముకలు గుల్లబారడం వంటివి ఎక్కువగా జరిగే అవకాశాలున్నాయి. నీటిలో నైట్రైట్స్ శాతం45 పీపీఎం/లీటర్ గా ఉండాలి. కానీ జిల్లాలో పలు ప్రాంతాల్లో 500 పీపీఏ/లీటర్ గానమోదైంది. జిల్లాలోని రావికంపాడు ప్రాంతంలో నైట్రైట్స్ శాతం 609 పీపీఎం/లీగా నమోదైంది.ప్రధానంగా కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, సారపాక ప్రాంతాల్లో నైట్రైట్స్శాతం 400 నుంచి 70 0 పీపీఎం/లీ, కొత్తగూడెం నియోజకవర్గంలోని సర్వారంలో 233 పీపీఎం నమోదు కావడంఆందోళన కలిగిస్తోంది. జూలూరుపాడు, కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వం చ మండలాల్లో 100నుంచి 576 పీపీఎంగా ఉంది. నైట్రైట్స్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో ఆక్సిజన్‍ సరఫరా సామర్థ్యం తగ్గుతుందని, దీంతో చిన్నపిల్లలకు ప్రధానంగా ఇబ్బంది కలుగుతుందని వైద్యులు పేర్కొంటున్నారుమరోవైపు రెసిడ్యూస్‍ సోడి యం కార్బొనేట్‍ ఎక్కువగా ఉంది. రెసిడ్యూస్‍ సోడియం కార్బొనేట్‍ ఎక్కువగా ఉండడం వల్ల భూముల్లో సారం తగ్గుతుంది. క్షార ధర్మాలు పెరుగుతాయి. పంటలకు ఇబ్బంది కలుగుతుంది. రెసిడ్యూస్‍ సోడియం కార్బొనేట్‍ సాధారణంగా 1.25 ఎంఈక్యూ/లీగా ఉండాలి.అశ్వాపురంలో అత్యధికంగా 9.87ఎంఈక్యూ/లీ, సారపాక 6.57, అశ్వారావ్ పేట 5.56, టేకులపల్లి5.78, మణుగూరు ప్రాంతాల్లో 3.98 ఎంఈక్యూ/లీగా నమోదయ్యాయి. జిల్లాలో పలు ప్రాంతాల్లో 2.5 నుంచి 3.95 ఎంఈక్యూ(జీ)/లీ గా నమోదైంది.భూగర్భజలాల కాలుష్యం పై ఇప్పటికైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కంపెనీల నుంచి వచ్చే సెస్‍, మినరల్‍ ఫండ్‍ నిధులతో భూగర్భజలాలు కలుషితం కాకుండా అవసరమైన శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే భవిష్యత్ లో జిల్లా ప్రజలు పలు వ్యాధుల బారినపడే ప్రమాదముందని  పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.భూగర్భ జలాల కాలుష్యంపై ఇటీవల పరిశీలన చేసిన మాట వాస్తవమే. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తాం. రసాయనాలు, ఎరువుల వాడకం రైతులుతగ్గించాలి. సాధ్యమైనంత వరకు సేంద్రియ ఎరువులనే వాడాలి. కాలుష్య నివారణకు ప్రతిఒక్కరూ తోడ్పాటునందించాలని కోరుతున్నారు.

No comments:

Post a Comment