అమరావతి నవంబర్ 13 (way2newstv.in)
ముఖ్యమంత్రి జగన్ ఇసుకాసుర లీలలు బయటపడ్డాయి. వైకాపా ఇసుక దొంగలు అడ్డంగా దొరికారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్టర్ లో వ్యాఖ్యానించారు. 5 నెలల్లో 42 మంది భవన నిర్మాణ కార్మికులని మింగేసిన పాపం వీరిని ఊరికే వదలదు. భవన నిర్మాణ కార్మికుల నోటి దగ్గర కూడు లాక్కొని వైకాపా నేతలు అవినీతి కోటలు నిర్మిస్తున్నారు.
ఇసుక పాపం వదలదు
వరద వలనే ఇసుక దొరకడం లేదు అని చిలక పలుకులు పలుకుతున్న జగన్ భవన నిర్మాణ కార్మికులకు క్షమాపణలు చెప్పాలని అన్నారు. సిమెంట్ కంపెనీల నుండి జే ట్యాక్స్ వసూలు అయ్యే వరకూ వరద కారణంగా ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలిపోతూనే ఉంటుంది. వైకాపా ఇసుక మాఫియా లిస్ట్ ర్యాంపుల దగ్గర క్యూ కట్టిన ట్రాక్టర్లలా పెరుగుతూనే ఉందని అయన అన్నారు.
No comments:
Post a Comment