చిత్తూరు నవంబర్ 11 , (way2newstv.in)
ముద్దు ముద్దు మాటల తో మంచితనం తప్పించి మరింకేమీ తెలీని పసి మనసును కర్కశంగా చిదిమేసిన కసాయి ఊహా చిత్రాన్ని పోలీసులు తాజాగా విడుదల చేశారు. ఐదేళ్ల చిన్నారి వర్షితను మాటల్లో చెప్పలేని రీతిలో అత్యాచారం చేసి.. ఆపై హత మార్చిన దుర్మార్గు డి ఊహా చిత్రాన్ని చిత్తూరు జిల్లా పోలీసులు విడుదల చేశారు. కొద్ది రోజుల క్రితం చిత్తూరు జిల్లా బి.కొత్త కోట మండలం గుట్ట పాళ్యానికి చెందిన వర్షితను మాయమాటలు చెప్పి చేనేతనగర్ కల్యాణ మండపం సమీపంలో అత్యాచారం చేసి.. ఆపై హత్యకు పాల్పడిన వైనం పెను సంచలనం గా మారింది.
ఐదేళ్ల చిన్నారిని చిదిమేసిన కసాయి ఊహా చిత్రం విడుదల
పెళ్లి లో కనిపించిన అత గాడి ఆనవాళ్లను.. సీసీ పుటేజ్ లో కనిపించిన అ స్పష్టమైన రూపాన్ని ఆధారంగా చేసుకొని ఈ ఊహా చిత్రాన్ని విడుదల చేశారు. ఈ పోలికలతో ఉన్న వ్యక్తి కనిపిస్తే తమకు సమాచారం వెంటనే అందించాలంటూ పోలీసులు చెబుతున్నారు. సమాచారం అందించిన వారి వివరాల్ని గోప్యంగా ఉంచుతామని చెబుతున్న పోలీసులు.. వర్షిత హంతకుడ్ని పట్టుకునేందుకు ప్రత్యేక బలగాలు వెతుకుతున్నట్లు చెప్పారు.చిన్నారి వర్షితను దారుణంగా హతమార్చిన నిందితుడ్ని పట్టుకొని కఠినంగా శిక్ష పడేలా చేయాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కోరారు. వర్షిత హత్యోదంతం తనను తీవ్రంగా కలిచివేసినట్లు ఆయన చెప్పారు. హంతకుడ్ని పట్టుకొని చట్టం ముందు నిలబెట్టాలన్నారు. దారుణ నేరానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్ష పడేలా చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. వర్షిత హంతకుడ్ని పట్టుకోవాలన్న పట్టుదల తో ఉన్న పోలీసులు.. తాజాగా ఆ నీచుడి ఊహా చిత్రాన్ని విడుదల చేశారు.
No comments:
Post a Comment