విజయవాడ నవంబర్ 7 (way2newstv.in)
గురువారం విజయవాడ ఆటోనగర్ లోని కృష్ణాజిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో జరిగిన కృష్ణాజిల్లా తెలుగుదేశంపార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ, జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, మాజీ శాసనసభ్యులు బోడె ప్రసాద్ బోండా ఉమామహేశ్వరరావు, తంగిరాల సౌమ్య, ఉప్పులేటి కల్పన, ముద్రబోయిన వెంకటేశ్వరరావు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ అమ్మినేని రామకృష్ణ , మాజీ మేయర్ కోనేరు శ్రీధర్, సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో మొదటగా పొలిట్బ్యూరో సభ్యుడిగా నియమితులైన వర్ల రామయ్యను అభినందించి సత్కరించారు.
తెలుగుదేశంపార్టీ గ్రామ, మండలాల అధ్యక్షులుగా సమర్థవంతమైన వారిని ఎన్నుకోవాలి....దేవినేని ఉమా
తెలుగుదేశంపార్టీ సంస్థాగత ఎన్నికల దృష్ట్యా జిల్లాలో జరుగుతున్న సంస్థాగత ఎన్నికలలో గ్రామ, మండలాల పార్టీ అధ్యక్షులుగా సమర్థవంతమైన వారిని ఎన్నుకోవాలని తీర్మానించారు. అదేవిధంగా ఈనెల 14వ తేదీ తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు భవన నిర్మాణ కార్మికులకు అండగా ఇసుక కొరతపై విజయవాడలో చేపట్టనున్న దీక్షను విజయవంతం చేయాలని మరియు నియోజకవర్గాల వారీగా పాల్గొన వలసిన విధివిధానాలను చర్చించి ఖరారు చేశారు.
No comments:
Post a Comment