Breaking News

07/11/2019

జస్టిస్ 2019 నివేదిక విడుదల

న్యూఢిల్లీ నవంబర్ 7 (way2newstv.in)
టాటా ట్రస్టు ఆధ్వర్యంలో ఇండియా జస్టిస్ 2019 నివేదికను విడుదల చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ నివేదిక విడుదల చేశారు. పోలీసు, జైళ్లు, న్యాయవ్యవస్థ, న్యాయసహాయం అనే 4 అంశాలపై ర్యాంకులను ప్రకటించింది. నాలుగు విభాగాల్లో కలిపి పెద్ద రాష్ర్టాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణకు 11, ఆంధ్రప్రదేశ్‌కు 13వ స్థానం లభించింది. 
జస్టిస్ 2019 నివేదిక విడుదల

పోలీసు విభాగంలో అగ్రస్థానంలో తమిళనాడు, 11వ స్థానంలో తెలంగాణ, ఐదోస్థానంలో ఆంధ్రప్రదేశ్, జైళ్ల విభాగంలో 13వ స్థానంలో తెలంగాణ, 15వ స్థానంలో ఏపీ, న్యాయవిభాగంలో 11వ స్థానంలో తెలంగాణ, 13వ స్థానంలో ఏపీ, న్యాయ సహాయం విభాగంలో తెలంగాణకు 4వ ర్యాంకు, ఏపీకి 10వ ర్యాంకు ఇచ్చారు.

No comments:

Post a Comment