Breaking News

05/11/2019

సీఆర్ పై రేవంత్ ఫైర్

హైద్రాబాద్, నవంబర్ 5, (way2newstv.in)
పట్టపగలే ప్రభుత్వ కార్యాలయంలో తహశీల్దార్‌ విజయారెడ్డి హత్య జరగడం దారుణమని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే రోజులు వచ్చాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల ఒత్తిడి కారణంగానే విజయారెడ్డి హత్య జరిగిందని ఆరోపించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...  ప్రభుత్వానికి, రెవెన్యూ శాఖకు దూరం ప్రభుత్వమే పెంచిందని ఆరోపణలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులంతా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని పేర్కొన్నారు. 
సీఆర్ పై రేవంత్ ఫైర్

ఘటనపై ఉద్యోగులు భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తే కాంగ్రెస్‌ పార్టీ వారికి పూర్తి మద్దతు ప్రకటిస్తుందని హామీ ఇచ్చారు.‘మేజిస్ట్రేట్ అధికారాలు ఉన్న అధికారిణిపై దాడి దారుణం. దాదాపు ఐదు వందల ఎకరాల భూ వివాదం నేపథ్యంలో ఈ హత్య జరిగింది. ఇంతటి ఘోరమై ఘటన జరిగితే న్యాయం చేస్తామని ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాలేదు. రెవెన్యూ శాఖ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దగ్గరే ఉంది. హత్య జరిగి 24 గంటలు గడుస్తున్నా సీఎం నివాళులు అర్పించేందుకు రాలేదు. రెవెన్యూ అధికారులను ప్రభుత్వం దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. మంత్రి కేటీఆర్ రెవెన్యూ అధికారులపై దాడి చేయాలని పిలుపునివ్వడం ఇలాంటి ఘటనలకు ఉసిగొల్పుతుంది. ఘటనపై సీబీఐ విచారణ జరపాలి’ అని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు

No comments:

Post a Comment