తిరుపతి నవంబర్ 05,(way2newstv.in):
టిటిడికి అనుబంధంగా ఉన్న దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అష్టబంధన జీర్ణోద్ధారణ మహాసంప్రోక్షణ నవంబరు 7 నుండి 10వ తేదీ వరకు వైఖానస ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి నవంబరు 7వ తేదీ గురువారం సాయంత్రం 6.00 నుండి రాత్రి 9.00 గంటలకు విష్వక్సేనారాధన, భగవత్పుణ్యాహం, సేనాధిపతి ఉత్సవం, మృత్సంగ్రహణం, అంకురార్పణం జరుగనుంది.
నవంబరు 7 నుండి 10వ తేదీ వరకు దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ
ఇందులో భాగంగా నవంబరు 8వ తేదీ ఉదయం 8.00 నుండి 10.00 గంటల వరకు వాస్తుహోమం, అగ్నిప్రతిష్ట, కుంభస్థాపనము, చతుష్ఠార్చన, సాయంత్రం 5.30 నుండి రాత్రి 9.00 గంటల వరకు వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. నవంబరు 9న ఉదయం 8.00 నుండి 10.00 గంటల వరకు వైదిక కార్యక్రమాలు, సాయంత్రం 3.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు మహాభిషేకము, తత్త్వన్యాస హోమాలు, శయనాధివాసము నిర్వహించనున్నారు.నవంబరు 10వ తేదీ ఉదయం 7.00 నుండి 9.00 గంటల వరకు హహాపూర్ణాహుతి, వృశ్చికలగ్నములో మహాకుంభాభిషేకము జరుగనుంది. సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవము, రాత్రి 8.00 నుండి 10.00 గంటల వరకు గ్రామోత్సవము నిర్వహిస్తారు.
No comments:
Post a Comment