Breaking News

01/11/2019

ప్రతి వెయ్యి మందికి ముగ్గురే పోలీసులు

హైద్రాబాద్, నవంబర్ 1 (way2newstv.in)
తెలంగాణలో ప్రతి లక్ష మంది జనాభాకు 218 మంది పోలీసులు పనిచేస్తున్నారు. లక్ష జనాభా ప్రాతిపదికన విశే్లషిస్తే లక్ష జనాభాకు పోలీసులు ఉన్న అంశంపై తెలంగాణ 19వ స్థానంలో ఉంది దేశంలో 24.84లక్షల మంది పోలీసు బలగాలు ఉండాలి. కాని 19.41 లక్షల మంది పోలీసులు ఉన్నారు. ఇందులో 12.36 లక్షల మంది సివిల్ పోలీసువలు, 2.34 లక్షల మంది జిల్లా ఆర్మ్‌డ్ పోలీసులు, 4.71 లక్షల మంది రాష్ట్ర ఆర్మ్‌డ్ పోలీసులు ఉన్నారు. దేశం మొత్తంపైన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం 2.85 లక్షల మంది పోలీసులతో అగ్రస్థానంలో ఉంది. రెండవ స్థానంలో 2.14లక్షల మంది పోలీసు బలగాలతో మహారాష్ట్ర ఉంది. పోలీసు బలగాలతో 1,29,41 ఖాళీలు రాష్ట్ర ఆర్మ్‌డ్ పోలీసు విభాగంలో, జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసు విభాగంలో 45,530 ఖాళీలు ఉన్నాయి. 
ప్రతి వెయ్యి మందికి ముగ్గురే పోలీసులు

సివిల్ పోలీసుల పోస్టులు 3.67 లక్షల ఖాళీలు ఉన్నాయి. దేశం మొత్తం మీద 5,42,697 లక్షల సివిల్ పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దేశంలో వివిధ రాష్ట్రాల్లో ట్రాఫిక్ విధుల నిమిత్తం 85,144 మంది పోలీసులు అవసరమైతే, 59,503 మంది పోలీసులు పనిచేస్తున్నారు. ఈ వివరాలను కేంద్ర హోంమత్రిత్వశాఖ పరిధిలోని బ్యూరో ఆఫ్ పోలీసు రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్ 2018 సంవత్సరానికి విడుదల చేసిన సర్వేలో వెల్లడించింది.అరుణాచల్ ఈశాన్య రాష్ట్రాలు, జమ్ముకాశ్మీర్, గోవా, చండీగడ్, ఢిల్లీ, పంజాబ్, చత్తీస్‌గడ్, హిమాచల్ ప్రదేశ్ తర్వాత తెలంగాణ ఉంది. ప్రతి లక్ష జనాభాకు ఆంధ్రా, మధ్యప్రదేశ్‌లో 145 మంది, అస్సాంలో 200 మంది, మహారాష్టల్రో 196 మంది, పాండిచ్ఛేరిలో 196 మంది, ఉత్తరాఖండ్‌లో 195 మంది, ఉత్తరప్రదేశ్‌లో 185 మంది, కేరళలో 150 మంది, ఓడిశాలో 156 మంది, కర్నాటకలో 159 మంది, గుజరాత్‌లో 171 మంది, బిహార్‌లో121 మంది పోలీసులు ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది పెద్ద రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలోనే పోలీసుల సంఖ్య మెరుగుగా ఉంది. ప్రతి చదరపు కి.మీకు తెలంగాణలో 1.47 మంది పోలీసులు ఉన్నారు. అంటే ప్రతి 458 మందికి ఒక పోలీసు ఉన్నట్లుగా భావించాలి. ఉత్తరప్రదేశ్‌లో గరిష్టస్థాయిలో 1,28,952 పోలీసు పోస్టులు, బిహార్‌లో 50,291 పోలీసు ఉద్యోగాలు, పశ్చిమబెంగాల్‌లో 48,981 ఉద్యోగాలు, ఖాళీగా ఉన్నాయి. తెలంగాణలో 76,407 మంది పోలీసు ఉద్యోగాలకు, 46,062 మంది పోలీసులు ఉన్నారు. ఇందులో మహిళా పోలీసులు 1490 మంది ఉన్నారు. ఖాళీగా 22,990 కానిస్టేబుల్ ఉద్యోగాలు, 4,087 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు, ఎఎస్‌ఐ ఉద్యోగాలు 1,606, ఎస్సై ఉద్యోగాలు 1,153 ఉద్యోగాలు, ఇనెస్పెక్టర్ ఉద్యోగాలు 368 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

No comments:

Post a Comment