Breaking News

01/11/2019

ట్రాక్ లో పడ్డ జెయింట్ కిల్లర్

కరీంనగర్, నవంబర్ 1, (way2newstv.in)
బండి సంజయ్..కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు. బీజేపీలో ఏ స్థాయి నుంచి వచ్చినా ఎదుగుతారన్న దానికి బండి సంజయ్ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ పై బండి సంజయ్ విజయం సాధించి జెయింట్ కిల్లర్ గా నిలిచారు. బీజేపీ ప్రభావంతో ఆయన గెలిచారన్న దానిలో కొంత నిజమున్నా కష్టపడి పార్టీలో ఎదిగి కిందిస్థాయి కార్యకర్తలకు అందుబాటులో ఉండటం వల్లనే బండి సంజయ్ విజయం సాధ్యమయిందన్నది అందరికి తెలిసిన వాస్తవం.అయితే కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన బండి సంజయ్ తర్వాత దూకుడు పెంచారు. కార్పొరేటర్ స్థాయి నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎదిగారు బండి సంజయ్. 
 ట్రాక్ లో పడ్డ జెయింట్ కిల్లర్

అనేకసార్లు కరీనంగర్ ఎమ్మెల్యేగా పోటీచేసినా అసెంబ్లీ లో అడుగుపెట్టలేకపోయిన బండి సంజయ్ నేరుగా దేశంలో అత్యున్న సభలో కాలుమోపారు. ఇప్పుడు ఆయన టార్గెట్ అంతా టీఆర్ఎస్. రోజుకో ఆరోపణలతో టీఆర్ఎస్ నేతలపై కాలు దువ్వుతున్నారు. ప్రధానంగా కరీంనగర్ ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి గంగుల కమలాకర్ ను బండి సంజయ్ టార్గెట్ చేసుకున్నారు.ఆయన కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఎంపీగా గెలిచిన వెంటనే బండి సంజయ్ గ్రానైట్ వ్యాపారంపై నిఘా పెట్టారు. గ్రానైట్ వ్యాపారంలో గత కొన్నాళ్లుగా జరుగుతున్న అక్రమాలపై గవర్నర్ కు నివేదిక అందించారు. కేంద్రమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లారు. గ్రానైట్ వ్యాపారంలో గంగుల కమలాకర్ ఉన్నారన్నది బండి సంజయ్ ఆరోపణ. కోట్లాది రూపాయలు పన్నులు ఎగ్గొట్టి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు.అలాగే గతంలో కరీంనగర్ ను కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీగా ప్రకటించింది. అయితే స్మార్ట్ సిటీ కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో కూడా అవినీతి జరిగిందని బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. దీనికి తగిన ఆధారాలతో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. స్మార్ట్ సిటీ విషయంలోనూ గంగుల కమలాకర్ నే బండ సంజయ్ లక్ష్యంగా చేసుకున్నట్లు కనపడుతుంది. అయితే గ్రానైట్ వ్యాపారులను,కాంట్రాక్టర్లను బెదిరించేందుకే బండి సంజయ్ ఈఆరోపణలు చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నా లోకల్ గా బండి సంజయ్ అంటే భయపడిపోతున్నారు. మొత్తం మీద తొలిసారి ఎంపీగా ఎన్నికయిన బండి సంజయ్ తన టార్గెట్ రీచ్ అవుతారో? లేదో చూడాలి.

No comments:

Post a Comment