Breaking News

05/10/2019

‘‘గాంధీ సంకల్ప యాత్ర’’కు ప్రజల బ్రహ్మరథం: .కిషన్ రెడ్డి

హైదరాబాద్ అక్టోబర్ 5   (way2newstv.in)
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి సికింద్రబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో చేపట్టిన ‘‘గాంధీ సంకల్ప యాత్ర’’కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రధానమంత్రినరేంద్ర మోదీ పిలుపు మేరకు మహాత్ముడి ఆశయాలను ప్రజల్లో విస్తృతవంగా వ్యాప్తి చేసేందుకు అక్టోబర్ 2న ప్రారంభించిన ఈ యాత్ర ప్రజల ఆదరాభిమానాల మధ్య ఉత్సాహంగాకొనసాగింది. మూడో రోజూ సంకల్ప యాత్రకు నీరాజనం పలుకితున్నారు. 
‘‘గాంధీ సంకల్ప యాత్ర’’కు ప్రజల బ్రహ్మరథం: .కిషన్ రెడ్డి

బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి యాత్రలో పాల్గొన్నారు. ఇక మహిళలయితే మంగళహారతులతో కిషన్ రెడ్డికి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పరిశుభ్రత ఆవశ్యకతను వివరించారు. ఎవరికి వారు స్వచ్ఛాగ్రాహిలా మారి తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే మన దేశం పరిశుభ్రంగా మారుతుందన్నారు. ఇక ప్లాస్టిక్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్వల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుందని, యుద్ధప్రాతిపదికన ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. పరిశుభ్రత, పర్యావరణాన్ని పరిరక్షించనప్పుడే మహాత్ముడికలలు నెరవేరుతాయన్నారు. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను దూరం పెడ్తామంటూ స్థానికులతో ప్రమాణం చేయించారు.

No comments:

Post a Comment