Breaking News

05/10/2019

కాంట్రాక్టు,ఇతర ప్రభుత్వ పనులలో బీసీలకు 50% రిజర్వేషన్

బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు  ఆర్ కృష్ణయ్య డిమాండ్
హైదరాబాద్ అక్టోబర్ 5  (way2newstv.in)
కాంట్రాక్టు మరియు ఇతర ప్రభుత్వ పనులలో జనాభా ప్రకారం బీసీలకు 50% రిజర్వేషన్ కోటా కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.నేడు బి.సి భవన్ లో బి.సి కాంట్రాక్టర్ల సంఘం సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ఆర్.కృష్ణయ్య ప్రసంగిస్తూ ప్రక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి బీసీలకు50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నం.25 జారీ చేశారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్సీలకు 15 శాతం ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవోనెంబర్ 59 జారీ చేశారు.  కాని బి.సిలకు కోటా ఇవ్వలేదు. 
కాంట్రాక్టు,ఇతర ప్రభుత్వ పనులలో బీసీలకు 50% రిజర్వేషన్


అలాగే కర్ణాటక రాష్ట్రంలో కూడా బీసీలకు కాంట్రాక్టు పనుల్లో 50 శాతం కోటా ఉంది. మన రాష్ట్రంలో బి.సిల పట్ల వివక్ష చూపుతున్నారని విమర్శించారు. కాంట్రాక్టు పనుల్లో బీసీలకు రిజర్వేషన్ కోట ఇవ్వకపోతే అగ్రకుల కాంట్రాక్టర్లతో పోటీపడలేకపోతున్నారు. అంతేగాక బీసీ కాంట్రాక్టర్లు ఎక్కువ వడ్డీ రేట్లకుఅప్పులు తెచ్చి కాంట్రాక్టు పనులు చేస్తూ నష్టపోయి అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా ప్రభుత్వం బీసీ కాంట్రాక్టర్లకు బీసీ కార్పొరేషన్ద్వారా కాంట్రాక్టు పనులు చేయుటకు ఆర్థికంగా సబ్సిడీ రుణాలు ఇవ్వాలని కోరారు.  అదేవిధంగా బీసీ వర్గానికి చెందిన కాంట్రాక్టర్లకు డిపాజిట్ లేకుండా కాంట్రాక్టు పనులు కేటాయించాలనిడిమాండ్ చేశారు. కాంట్రాక్టు విధానంలో లోపభూయిష్టంగా ఉన్నందున కాంట్రాక్టు పనులు బీసీలకు దక్కడం లేదన్నారు. కాంట్రాక్టు పనులలో బీసీలకు కోట కల్పిస్తే తప్ప న్యాయంజరగదన్నారు.  అలాగే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలలో కోటా ఉండాలని కోరారు.

No comments:

Post a Comment