Breaking News

03/10/2019

హస్తినకు కేసీఆర్

హైద్రాబాద్, అక్టోబర్ 3, (way2newstv.in)
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి  వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం 11:30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం కేసీఆర్ భేటీ అవుతారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఈ భేటీలో చర్చిస్తారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులను పెంచడంతోపాటు రాష్ట్రంలో ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వాలని ప్రధానిని సీఎం కోరనున్నారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయప్రాజెక్టు హోదా కల్పించాలని ఇదివరకే అనేకసార్లు ప్రధానిని సీఎం కోరిన విషయం తెలిసిందే.
హస్తినకు కేసీఆర్

రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువుల పూడిక తీసే మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని నీతిఆయోగ్ ప్రశంసించింది. దీనివల్ల తెలంగాణలో భూగర్భజలాలు పెద్దఎత్తున పెరుగుతున్నాయి. ఈ పథకానికి ఆర్థిక సహాయం అందించాలని గతంలోనే ప్రధానికి సీఎం విజ్ఞప్తిచేశారు. ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించే మిషన్ భగీరథ పథకాన్ని స్వయంగా ప్రధానే రాష్ట్రానికి వచ్చి ప్రారంభించారు. ఈ పథకానికి ఆర్థికసాయం అందించాలని నీతి ఆయోగ్ కేంద్రానికి సిఫారసు కూడా చేసింది. ఈ రెండు పథకాలకు ఆర్థిక సహాయమివ్వాలని ప్రధానిని ఈ భేటీలో కోరనున్నారు. కంటోన్మెంట్ ఏరియాలో రోడ్ల విస్తరణకు భూములు ఇవ్వాలని ఇదివరకే కేంద్రాన్ని సీఎం కోరారు. తాజాగా మరోసారి ఈ భూమిని ఇచ్చే విషయంపై ప్రధానితో సీఎం చర్చించనున్నారు.

No comments:

Post a Comment