Breaking News

03/10/2019

భారీ డిస్కౌంట్ ఆఫర్లతో కార్లు

హైద్రాబాద్, అక్టోబరు 3,(way2newstv.in)
పండగ సీజన్ వచ్చేసింది. మార్కెట్లో పలు కంపెనీలు సరికొత్త ఆఫర్లు-డిస్కౌంట్లతో కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. దసరా, దీపావళి పండగల సందర్భంగా ప్రతిఒక్కరూ కొత్త వాహనం కొనుగోలు చేసేందుకు  ఆరాటపడుతుంటారు. కొన్ని దశాబ్దాలుగా ఆటో మొబైల్ పరిశ్రమలో సేల్స్ పడిపోవడంతో కంపెనీలన్నీ దివాలా తీశాయి. చాలా కంపెనీలు తమ ప్రొడక్షన్ కూడా నిలిపివేశాయి. పండగ సీజన్ రావడంతో ఆటో రంగంలో కొత్త ఆశలు చిగురించాయి. తమ సేల్స్ కు ఇదే సరైన సమయమని భావించే కంపెనీలు తమ ప్రొడక్టులపై ఆఫర్లు, డిస్కౌంట్లను గుప్పిస్తుంటాయి. మార్కెట్లో తక్కువ ధరకే ఆఫర్ చేస్తుంటాయి.మిగిలిన ఓల్డ్ స్టాక్ క్లీన్ చేసేందుకు పండగ సీజన్ లో ప్లాన్ చేస్తుంటాయి.
భారీ డిస్కౌంట్ ఆఫర్లతో కార్లు

దీపావళి సందర్భంగా కొత్త కారు కొనాలని అనుకుంటున్నారా? వెంటనే త్వరపడండి. ఆటో కంపెనీలైన మారుతి సుజుకీ, హుందాయ్, హోండా, టాటా సహా పలు కంపెనీలు ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తున్నాయి. కార్ల ధరలను భారీ తగ్గింపుకే ఆఫర్ చేస్తున్నాయి. మారుతి కంపెనీ తమ బ్రాండ్ అయిన సీడాన్ డిజైర్, సబ్ కాంప్టాక్ట్   వితారా బ్రెజా కార్లపై భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది. క్యాష్ డిస్కౌంట్, ఎక్సేంజ్ బోనస్, కార్పొరేట్ బెనిఫెట్స్ కూడా ఆఫర్ చేస్తున్నాయి. టయోటా కారు కంపెనీ అయితే లక్షల్లో డిస్కౌంట్లు అఫర్ చేస్తోంది. ఆటో కంపెనీలన్నీ తమ కార్లపై 3 నుంచి 4 లక్షల వరకు డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి. బిగ్ డిస్కౌంట్ రూ.1.2 లక్షల వరకు అఫర్ చేస్తోంది. ఎక్సేంజ్ బోనస్ కింద రూ.లక్ష వరకు ఆఫర్ చేస్తుండగా.. కార్పొరేట్ బెనిఫెట్ డిస్కౌంట్ ధర రూ.20వేలు వరకు అఫర్ చేస్తోంది.
టాటా మోటార్స్ కార్లపై డిస్కౌంట్లు :
టాటా మోటార్స్ డీలర్ షిప్.. ప్రస్తుతం టయాగో, టైగర్, నెక్సాన్, హెక్సా రేంజ్ కార్లపై క్యాష్ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. టయాగో కార్లపై మొత్తం డిస్కౌంట్ ధర రూ.35వేలు (రూ.20వేలు క్యాష్, రూ.10వేలు ఎక్సేంజ్, రూ.5వేలు కార్పొరేట్ డిస్కౌంట్) ఆఫర్ చేస్తోంది.టైగర్ కార్లపై రూ.65వేలు క్యాష్ డిస్కౌంట్ (రూ.20వేలు క్యాష్, రూ.25వేలు ఎక్సేంజ్, రూ.7వేలు కార్పొరేట్ డిస్కౌంట్) ఆఫర్ అందిస్తోంది. టాటా నెక్సాన్ కార్లపై ధర రూ.72వేలు తగ్గించగా (రూ.40వేలు క్యాస్, రూ.25వేలు ఎక్సేంజ్, రూ.7వేలు కార్పొరేట్) ఆఫర్ చేస్తోంది. టాటా హెక్సా మొత్తం డిస్కౌంట్ ధర రూ.1.45 లక్షలు కాగా.. కొత్త 2019 హెక్సా కార్లపై డిస్కౌంట్ రూ.1 లక్ష వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.

No comments:

Post a Comment