శాంతి భద్రతలపై అప్రమత్తం
కలెక్టర్ల భేటీలో సీఎం కేసీఆర్
హైదరాబాద్, అక్టోబరు 10, (way2newstv.in)
గురువారం ఉదయం గంటలకు ప్రగతి భవన్ లో మంత్రులు, కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. సీఎం మాట్లాడుతూ 30 రోజుల కార్యాచరణ గ్రామాల్లో విజయవంతం అయింది. గ్రామాల్లో విద్యుత సమస్యలు పరిష్కారం అయ్యాయి. పవర్ వీక్ ను విద్యుత్ సిబ్బంది విజయవంతంగా నిర్వహించారని ప్రశంసించారు. అన్ని శాఖల్లో కంటే విద్యుత్ శాఖ మొదటి స్థానంలో నిలిచింది.
ఆర్టీసీ కార్మికులపై కఠిన వైఖరి
మొదటి విడత 30 రోజుల కార్యక్రమంలో మంత్రులు, కలెక్టర్లు, సర్పంచ్ లు, అధికారులకు అభినందనలు. ఇదే స్ఫూర్తిని భవిష్యత్ లో కొనసాగించాలి. గ్రామాల అభివృద్ధి కోసం నెలకు రూ. 339 కోట్లను విడుదల చేస్తామని అన్నారు.తెలంగాణలో 5వ తేదీ నుంచి జరుగుతున్నల ఆర్టీసి కార్మికుల సమ్మెపై కుడా సమావేశంలో చర్చించారు. ఆర్టీసీని మరింత బలోపేతం చేయడంతో పాటు లాభాల బాట పట్టించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలతో ఉన్నతాధికారులతో పలుమార్లు కేసీఆర్ సమీక్షలు నిర్వహించారు. 13వ తేదీ నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానుండటంతో... ఆ లోపే ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థను గాడిన పెట్టాలని దిశానిర్దేశం చేసారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం కఠినంగా ఉందని.. జిల్లాల్లో శాంతి భద్రతలపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు సీఎం సూచించారు.
No comments:
Post a Comment