Breaking News

10/10/2019

తొక్కిపెడితే రెచ్చిపోతాం

మాజీ సీఎం చంద్రబాబు
విశాఖపట్నం అక్టోబరు 10, (way2newstv.in)
విశాఖ టీడీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.  పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమన్వయ కమిటీ సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేశ్, యలమంచిలి ఇన్ఛార్జి రమేశ్, ఇతర నేతలు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ భవిష్యత్తులో టీడీపీని గుర్తుపెట్టుకునేలా పునాదులు వేయాలనేదే తమ లక్ష్యమని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో అతి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఖ్యాతి తనకే దక్కిందన్నారు. ఓడిపోయామని భయం ఉండకూడదని, ప్రజల పక్షాన పోరాటం చేయాలని నేతలకు సూచించారు. 
తొక్కిపెడితే రెచ్చిపోతాం

అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షాన్ని తొక్కి పెట్టాలని చూస్తే ఇంకా రెచ్చిపోతారు తప్పితే, అణిగి పోరని చంద్రబాబు అన్నారు. తాను 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని, ప్రతి ఒక్కరి జాతకాలు తెలుసని అన్నారు. ..మంచికి మంచిగా ఉంటా..తమషా చేయాలని అనుకొంటే సాధ్యం కాదని వ్యాఖ్యానించారు.. మంచిగా ఉంటే బాగుంటుందని, తమాషాలు చేయాలని చూస్తే సాధ్యం కాదని గట్టిగా హెచ్చరించారు. పోలీసుల్లో కొంత మంది అతిగా ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మీరు కావాలంటే వైసీపీలో చేరిపోవచ్చని సలహా ఇచ్చారు. పోలీసు వ్యవస్థ శాంతి భద్రతలు కాపాడి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. గతంలో తానెప్పుడు ఇంతగా పోరాడలేదని, నాలుగు నెలలుగా పోరాటం చేస్తున్నానన్నారు. వైసీపీ శ్రేణులు నాలుగు నెలల్లో 12 మందిని చంపేశారని, 570 దాడులు చేశారని, 120 కుటుంబాలు గ్రామాలు వదిలి వెళ్ళే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు. కార్యకర్తలు ఎవరూ భయపడడం లేదని, నాయకులు అండగా ఉండి సమిష్టిగా పోరాడితే..పులివెందులకు జగన్ పారిపోవడం ఖాయమన్నారు బాబు.

No comments:

Post a Comment