Breaking News

10/10/2019

కేసీఆర్ అంతానికిది ఆరంభం

ఆర్టీసీ ఐకాసకు భాజపా, కాంగ్రెస్, వామపక్షాల మద్దతు
తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నిరసన
మహబూబ్ నగర్ అక్టోబరు 10, (way2newstv.in)
ఆర్టీసీ కార్మికులతో వ్యవహరిస్తున్న చూస్తుంటే కేసీఆర్ అంతానికి ఆరంభమైనట్టేనని ఆయా పార్టీల నేతలు పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రోడ్లు, భవనాలశాఖ అతిథి గృహఆవరణలోని తెలంగాణ అమరవీరుల స్తూపం ఎదుట ఆర్టీసీ ఐకాస ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాజపా రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్, పీసీసీ కార్యదర్శి ఎన్పీ వెంకటేశ్,డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బెక్కరి అనిత, భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు వీరబ్రహ్మాచారి, పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్రా ఘవాచారి, సీపీఎం జిల్లా అధ్యక్షుడు ఎ.రాములు, ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రాజసింహుడు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కురుమూర్తి తదితరులు పాల్గొని ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తమ మద్దతు తెలిపారు. 
కేసీఆర్ అంతానికిది ఆరంభం

శాంతికుమార్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు సమ్మె కొత్తేమీ కాదని, కేసీఆర్కు మాత్రం ఇది తొలిసారని, వెనకా ముందు ఆలోచించకుండా ఆర్టీసీపై చట్టవ్యతిరేక నిర్ణయాలు తీసుకుని ఇరకాటంలో పడ్డారని అన్నారు. ఆర్టీసీతో పెట్టుకున్న ఏ ముఖ్యమంత్రులు మనలేకపోయారని పేర్కొన్నారు. ఏఉద్యోగ సంఘాల భాగస్వామ్యంతో తెలంగాణ ఉద్యమం విజయవంతంగా ముందుకు సాగి రాష్ట్రం ఏర్పడిందో అవే ఉద్యోగ సంఘాలు కేసీఆర్ను గద్దె దింపబోతున్నాయన్నారు. పీసీసీకార్యదర్శి ఎన్పీ వెంకటేశ్ మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మెపై తెరాసలోని మంత్రులు, ఎమ్మెల్యేలు నోరు విప్పకపోవడం శోచనీయమన్నారు. డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ మాట్లాడుతూఈ సమ్మె ఒక్క ఆర్టీసీదే కాదని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిదన్నారు. పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ రాఘవాచారి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తెలంగాణలోనియావత్ ప్రజానీకం మద్దతు ఉందని అన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ.రాములు, ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రాజసింహుడు, బీఎంఎస్నా యకుడు నర్సింహ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కురుమూర్తి, పురపాలక ఉద్యోగ, కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఖమర్అలి తదితరులు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు
సంపూర్ణ మద్దతు తెలిపారు

No comments:

Post a Comment