Breaking News

09/10/2019

రికార్డు స్థాయిలో సేద్యం

మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి అక్టోబరు 9, (way2newstv.in)
గ్రామ రైతులు కన్నీళ్లను వీడి రికార్డు స్థాయిలో సేద్యం సాగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రం లోని తన నివాసంలో జరిగిన మీడియాసమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో బీడు పొలాలన్నీ నారు మల్లు గ మారి ఎన్నడూ లేని విధంగా పంటలు సాగుతున్నాయని ఆయన అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల కింద వర్షాధారం కలిపి కోటి 11 లక్షల ఎకరాలలో పంటలు సాగవుతున్నాయి అని ఆయన అన్నారు. కెసిఆర్ మంత్రివర్గంలో వ్యవసాయ శాఖమంత్రి గా ఉన్నందుకు తానెంతో గర్వపడుతున్నానని ఆయన అన్నారు.
రికార్డు స్థాయిలో సేద్యం

తెలంగాణ ప్రభుత్వం రైతులకు చేస్తున్న సహాయం ప్రపంచంలోనే ఎవరూ చేయడం లేదని, ఈ దేశంలో ఎవరూ సాహసించని విధంగా కెసిఆర్ ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహం ఇస్తుందని ఆయన అన్నారు.24 గంటల ఉచిత కరెంటు, సబ్సిడీ విత్తనాలు, సాగునీరు, రైతుబంధు, రైతు బీమా పథకాలు ఎక్కడ లేవని ఆయన వ్యక్తపరిచారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు చేస్తున్నసహాయం కంటితుడుపు నేనని, ఆ మాత్రం రైతులకు సహాయం చేయాల్సిన అనివార్య పరిస్థితినీ కేంద్రానికి కల్పించింది కెసిఆర్ ప్రభుత్వ ఘనత నేనని ఆయన అన్నారు. తమ ఆరేళ్లపాలనలో ఎవరూ సాధించని విజయాలు తమ ప్రభుత్వానికి దక్కిందని, డిమాండ్ల కోసం చేస్తున్న ఆందోళనలు నెరవేర్చాలని అనడం సహేతుకం కాదని, ఎక్కిన చెట్టు నర కొంటున్నఆర్టీసీ ఉద్యోగుల ని ఆయన అన్నారు.తెలంగాణ ఉద్యమం ఈ ప్రాంతానికి సంబంధించిందని, కేంద్రం దృష్టికి ప్రజల ఆకాంక్ష తెలిపేందుకు అప్పుడు ఉద్యమం చేశామని , ప్రస్తుత మాట్లాడుతున్న తెలంగాణ విపక్ష పార్టీలుఉద్యమ సమయంలో తెలంగాణలో ఒక లా ఆంధ్రాలో ఒకలా రెండు నాలికలా ధోరణి మాట్లాడింది మనం మరువ లేదని ఆయన అన్నారు. ప్రతిపక్ష పార్టీలు పూటకో మాటమాట్లాడుతున్నారని, కాంగ్రెస్ బిజెపి పాలిత రాష్ట్రాలలో ఇక్కడ చేసిన డిమాండ్లను అమలు చేసే దమ్ముందా అని ఆయన అన్నారు. విపక్షాలు ఊహించని పథకాలను తెలంగాణ ప్రభుత్వంఅమలు చేస్తుందని, ఆచరణలో సాధ్యం కాని హామీలను అమలు చేయాలనడం అవివేకమని ఆయన అన్నారు. పండగపూట ప్రజల ఇబ్బందులు పడుతున్న కార్మిక నేతలకు సర్దిచెప్పాల్సింది బోయి ఏగ తోయడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. ఆర్టీసీ కార్మిక నేతలు రహస్య ఎజెండా తో పనిచేస్తున్నారని, కార్మికులు వారి ఉచ్చులో పడొద్దని ప్రభుత్వం విజ్ఞప్తిచేసిందని ఆయన అన్నారు. పదమూడవ తేదీన వాల్మీకి మహర్షిజయంతి ఎప్పటి మాదిరిగానే ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని, వనపర్తి ప్రాంతంలో సొంత డబ్బుతో తొలి వాల్మీకి మహర్షి, ఆచార్య జయశంకర్, చాకలి ఐలమ్మ విగ్రహాలను పెట్టిందితానేనని ఆయన అన్నారు. ప్రభుత్వం సమకూర్చిన దాదాపు 25 లక్షలతో కమ్యూనిటీ హాల్, వాల్మీకి మహర్షి విగ్రహ ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. తాటిపాముల వీర సముద్రంఅలుగు బారిన సందర్భంగా గంగ పూజ చేసి విజయదశమి నీ మొదలు పెట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, గట్టు యాదవ్ , వాకిటి శ్రీధర్ తోపాటు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment