Breaking News

16/09/2019

ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి

జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి
వనపర్తి సెప్టెంబర్ 16 (way2newstv.in)
గ్రామాల అభివృద్ధి ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి చెందుతాయని జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి అన్నారు. 30 రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా సోమవారం జిల్లాలోని తాటిపాముల, కొత్తకోట మండలంలోని కనిమెట్ట గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న చిన్న సమస్యను కూడా ప్రభుత్వం  చేస్తుందని అనుకోవడం సరికాదని, అందుకోసం ప్రజలందరూ భాగస్వాములై ఆ పని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. 
ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి

అందుకోసం ప్రజలందరూ కూడా శ్రమదానం తో గ్రామాలన్నీ బాగు చేసుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామంలో జరుగుతున్నల 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక పనులను ఆయన పరిశీలించి పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి. కొత్తకోట ఎంపిపి గుంత మౌనిక. వైస్ చైర్మన్ వామన గౌడు అధికారులు పాల్గొని ప్రసంగించారు. కలెక్టర్ శ్వేత మహంతి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రజలతో అడిగి తెలుసుకున్నారు.

No comments:

Post a Comment