Breaking News

19/09/2019

జోష్ నింపే పనిలో బాబు

విజయవాడ, సెప్టెంబర్ 19, (way2newstv.in)
ప్రతి మరణం తర్వాత రాజకీయమే.. ప్రతి సంఘటనా పాలిటిక్స్ కు ముడిపెడతారు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబునాయుడు తనకు రాజకీయంగా కలసి వస్తుందనుకున్న ఏ అంశాన్ని అంత తేలిగ్గా వదలరు. ఎదుటి వారిపై నిందలు మోపే కార్యక్రమాన్ని భుజానికెత్తుకుంటారు. అధికారంలో ఉన్నప్పుడూ అంతే…లేనప్పడూ అంతే. రాజకీయంగా తనకు ఉపయోగపడుతుందనుకుంటే దానిని ఎంతవరకైనా లాగే మనస్తత్వం చంద్రబాబుది అని పార్టీలో అందరూ ఏకగ్రీవంగా అంగీకరించే అంశం.సరిగ్గా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు కడప జిల్లా పులివెందులలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. హత్య జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు స్పందించిన తీరు కొంత ఎబ్బెట్టుగా అన్పించింది. 
జోష్ నింపే పనిలో బాబు

అక్కడి సాక్ష్యాలన్నీ తుడిపేశారని, నిందితులు తప్పించుకోవడానికి ప్రయత్నంలో భాగంగా సాక్ష్యాలు చెరిపేశారన్నారు. వైస్ వివేకా హత్య దారుణమంటూనే జగన్ కుటుంబ సభ్యులపైనే ఆయన అనుమానం వ్యక్తం చేశారుఅంతేకాదు జగన్ గతంలో వైఎస్ వివేకానందరెడ్డిని కొట్టారని కూడా చంద్రబాబు తన ఎన్నికల ప్రచారంలో ప్రధాన అంశంగా మార్చారు. ఇక కోడికత్తి అంటూ జగన్ పై జరిగిన దాడిని వెటకారం చేస్తూ మాట్లాడారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారం మొత్తం కోడికత్తి, వైఎస్ వివేకాహత్యలపైనే ఎక్కువగా సాగింది. అయితే ప్రజలు దీన్ని పట్టించుకోలేదనడానికి ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఇక తాజాగా కోడెల శివప్రసాద్ ఆత్మహత్యను కూడా రాజకీయంగా ఉపయోగించుకునే పనిలో ఉన్నారు.కోడెల ఆత్మహత్య తర్వాత 175 నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు నిరసన ప్రదర్శనలు చేయాలని పిలుపునిచ్చారు. కోడెల ఆత్మహత్యకు ప్రభుత్వ వేధింపులే కారణమని విమర్శిస్తున్నారు. జగన్ ఉన్మాది అని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రభుత్వంపై కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిని ప్రజలు నమ్ముతారా? లేదా? అన్నది పక్కన పెడితే ఇటీవల ఎన్నికల్లో దారుణ ఓటమి పాలయిన టీడీపీ క్యాడర్ లో జోష్ నింపడానికి మాత్రం కొంత పనికి వస్తుందనిపిస్తోంది. అంతకు మించి పెద్దగా ఉపయోగం లేదన్నది టీడీపీ నేతల నోటి నుంచే విన్పిస్తున్న మాట.

No comments:

Post a Comment