Breaking News

05/09/2019

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు : సీఎం జగన్

విజయవాడ, సెప్టెంబర్ 5, (way2newstv.in)
భారత మాజీ రాష్ట్రపతి, విద్యావేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనకు నివాళులు అర్పించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. కృష్ణా జిల్లా విజయవాడలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో జగన్ పాల్గోన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ  .. అధ్యాపకుడిగా జీవితాన్ని ప్రారంభించి.. రాష్ట్రపతిగా ఎదిగిన డా. సర్వేపల్లి రాథాకృష్ణ అందరికీ ఆదర్శమని కొనియాడారు. 
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు : సీఎం జగన్

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గురువుల పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు చూపించారని అన్నారు. గురువు వెంకటప్పయ్య పేరుతో వైఎస్సార్ పులివెందులలో స్కూల్ను స్థాపించారని తెలిపారు. విద్య నేర్పిన గురువులను పూజించే గొప్ప సంస్కృతి భారతదేశంలో ఉందని శ్లాఘించారు. జాతి నిర్మాణంలో యువత పాత్రను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు ఎనలేని కృషి చేస్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరక్షరాస్యత శాతం సున్నా చేయాలన్నది తన లక్ష్యంగా సీఎం జగన్ పేర్కొన్నారు. బ్రిక్స్ ఎకానమీ లెక్కల ప్రకారం కాలేజీలకు వెళుతున్న విద్యార్థులు మన దేశంలో కేవలం 36 శాతమేనని వెల్లడించారు.  కార్యక్రమంలో భాగంగా అనంతరం రాష్ట్రంలో ఉత్తమ సేవలందించిన గురువులకు ఆయన అవార్డులు అందజేశారు.

No comments:

Post a Comment