Breaking News

11/09/2019

అంతా దందానే.. (నల్గొండ)

నల్గొండ, సెప్టెంబర్ 11 (way2newstv.in): 
అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీల దందా ఏళ్ల తరబడిగా కొనసాగుతూనే ఉంది. ఏజెన్సీ నిర్వాహకులు నిరుద్యోగులను నిలువు దోపిడీ చేస్తున్నారు. నెలకురూ.10వేల జీతం వచ్చే అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగానికి రూ.లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయలకుపైనే వసూలు చేసిన సంఘటనలు ఉన్నాయి. అంతోఇంతో అదనపు ఆదాయం ఉంటుందనిభావిస్తున్న శాఖల్లో అయితే వసూళ్ల రేటు పెద్దగానే ఉంటుంది. ఈ ఉద్యోగాల విషయంలో డబ్బుల దందా పెద్ద ఎత్తున కొనసాగుతోంది. తాజాగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో అవుట్‌ సోర్సింగ్‌ పోస్టులభర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఒక ఏజెన్సీ నిర్వాహకుడు వసూళ్ల దందాకు తెగబడినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై స్థానిక ప్రజాప్రతినిధి కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన విచారణ జరిపారు.వాస్తవమేనని తేలడంతో ఆగ్రహించిన కలెక్టర్‌ వారికి తిరిగి డబ్బులు ఇవ్వాలంటూ ఆ ఏజెన్సీ నిర్వాహకుడిని ఆదేశించారని తెలిసింది. 
అంతా దందానే.. (నల్గొండ)

దీంతో పాటు ఆ ఏజెన్సీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని ఆదేశించారనిసమాచారం.  ఈ పోస్టులకు సంబంధించి కొందరు ఇప్పటికే ఆ శాఖలో రోజువారీ వేతనంపై  పనిచేస్తున్నారు. వారంతా తమనే అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిన తీసుకోవాలని అధికారులకు దరఖాస్తులుపెట్టుకున్నారు. వారినుంచే ఏజెన్సీ డబ్బులు వసూలు చేసిందని సమాచారం. ప్రస్తుతం భువనగిరి, సూర్యాపేటలో భర్తీ ప్రక్రియ ప్రారంభం కాలేదు.ఉమ్మడి జిల్లా పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిన 24 పోస్టులను భర్తీ చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులనుంచి ఆదేశాలువచ్చాయి. నల్లగొండ, సూర్యాపేటలో ఒకే ఏజెన్సీకి  ఉద్యోగులను సమకూర్చే కాంట్రాక్ట్‌  దక్కింది. యాదాద్రి జిల్లాలో మాత్రం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఏజెన్సీకి అప్పగిస్తున్నట్లు సమాచారం. ఇటీవలకలెక్టర్‌ మిగిలిన జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించారు. నల్లగొండలో ఉన్న ఏడు పోస్టులకు సంబంధించి నలుగురినుంచి  ఒక ఏజెన్సీ నిర్వహకుడు రూ.75వేల చొప్పునరూ.3లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. ఈ విషయంపై బాధితుల పక్షాన నల్లగొండ శాసనసభ్యుడికి ఫిర్యాదు అందడంతో ఆయన కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లారని చెబుతున్నారు. దీంతో కలెక్టర్‌విచారణ చేపట్టారు. నలుగురినుంచి ఏజెన్సీ నిర్వాహకుడు డబ్బులు వసూలు చేశాడని తేలడంతో కలెక్టర్‌ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి, వెంటనే సదరు నిర్వాహకుడిని పిలిపించి బాధితులకుడబ్బులు తిరిగివ్వాలని ఆదేశించారు. ఆ తర్వాత ఏజెన్సీని కూడా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని  సంబంధిత అధికారులకు ఆదేశించినట్లు తెలిసింది.జిల్లాలో కొన్ని అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీల దందా ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. వాస్తవంగా కాంట్రాక్టర్‌ ప్రభుత్వం అడిగిన సిబ్బందిని వారి క్వాలిఫికేషన్‌ ఆధారంగా ప్రభుత్వ శాఖలకు పంపించాల్సిఉంది. ఈ సందర్భంలో వారినుంచి ఎలాంటి డబ్బులూ వసూలు చేయరాదు. కానీ ప్రస్తుతం పెరిగిపోయిన నిరుద్యోగ సమస్య ఏజెన్సీలకు కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ అవకాశంతో కొందరుఏజెన్సీల నిర్వాహకులు రూ.కోట్లకు పడగలెత్తారు. కొందరు అధికారులకు డబ్బులు ముట్టజెప్పి ఏజెన్సీ దక్కించుకుంటుండగా మరికొందరు ప్రజాప్రతినిధుల ద్వారా ఏజెన్సీలు పొందుతున్నారన్నఆరోపణలు ఉన్నాయి. దీంతో వారి వసూళ్ల దందా పెద్ద ఎత్తున పెరిగిపోయింది.  రూ.15వేలు వచ్చే అవుట్‌ సోర్సింగ్‌ పోస్టుకు రూ.2లక్షలు వసూలు చేస్తున్నారంటే  దాదాపు సంవత్సరం పైగానేవారు ఉచితంగా  పనిచేయాల్సి వస్తున్నట్టే. అదనపు సంపాదన ఉం టుందని భావించే శాఖల్లో ఉద్యోగమైతే.. ఒక పోస్టుకు రూ.3లక్షల పైనే వసూలు చేస్తున్నార న్న ఆరోపణలు ఉన్నాయి. అయితేఇప్పటి వరకు కొందరు  నిర్వాహకులు ఇష్టానుసారంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. డబ్బులు లేని వారికి అన్ని అర్హతులు ఉండీ అవకాశం దొరకని పరిస్థితి. కొందరు ఏజెన్సీ నిర్వాహకులు అర్హతలులేకున్నా బోగస్‌ సర్టిఫికెట్లు సృష్టించి కూడా ఉద్యోగాలు ఇస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.  జిల్లా మెడికల్‌ కళాశాలలో అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిన పోస్టులు మంజూరు కావడంతో ఏజెన్సీలదందా మొదలైంది.

No comments:

Post a Comment