Breaking News

11/09/2019

బీజేపీలోనూ... కాంగ్రెస్ కల్చర్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11, (way2newstv.in)
కాంగ్రెస్ సంస్కృతి అని అంటారు కానీ అన్ని పార్టీలనూ అదే జరుగుతోంది. దేశంలో ఇపుడు పెద్ద పార్టీగా చెప్పుకుంటూ రెండవమారు కూడా అధికారంలోకి వచ్చిన బీజేపీలోనూ భిన్న భావనలు,గొడవలు, గందరగోళాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో చూసుకున్నపుడు తెలంగాణా బీజేపీ ఎపుడూ చంద్రబాబుని సపోర్ట్ చేయలేదు. ఏపీ బీజెపీపై అప్పట్లో టీడీపీసామాజిక వర్గానికి చెందిన ఓ పెద్దాయన పడగనీడ ఉండేదని, ఆ కారణంగానే ఆ పార్టీ ఏపీలో ఎదగలేకపోయిందన్న ఆగ్రహం తెలంగాణా బీజేపీలో ఉంది. ఉమ్మడి ఏపీగా కలసి ఉన్న రోజుల్లో కూడాకోస్తా సామాజికవర్గాల ఆధిపత్యాన్ని తెలంగాణా బీజేపీ నేతలు సహించేవారు కాదు. ఇపుడు ఎటూ రెండు రాష్ట్రాలు అయ్యాయి. అయితే ఏపీలో బీజేపీ ఎదగకపోవడానికి మాత్రం ఇప్పటికీ ఆ పడగనీడఅలాగే ఉందన్న అనుమానం తెలంగాణా బీజేపీ నాయకుల్లో ఉంది. అందుకే వారు టీడీపీ నీడను సైతం వ్యతిరేకిస్తారు. 
 బీజేపీలోనూ... కాంగ్రెస్ కల్చర్

ఇపుడు ఏపీ బీజేపీ నాయకులు జగన్ ని విమర్శిస్తూంటే తెలంగాణా బీజేపీనాయకులు మాత్రం ఆయన్ని కనీసం ఏమీ అనకపోగా పాలన బాగానే ఉందని కూడా చెబుతున్నారు.తెలంగాణాకు చెందిన బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధరరావు ఏపీ పర్యటనలో భాగంగా కొన్నిహాట్ కామెంట్స్ చేశారు. కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉంది కదా అని చేరిపోయి గతంలో చేసిన అవినీతి పాపాన్ని కడిగేసుకుందామంటే కుదిరే పని కాదని కచ్చితంగా చెప్పేశారు. ఎవరి పాపాన్నివారే మోయాలి, అందులో రెండో మాట లేదు, బీజేపీ నెత్తిన ఈ పాపాలను రుద్దాలని చూస్తే మాత్రం గట్టిగానే పట్టించుకుంటామని, అవినీతిపరులపై కఠినంగానే వ్యవహరిస్తామని చెప్పుకొచ్చారు.ఈ మాటలను ఎందుకు అన్నారో, ఎవరిని ఉద్దేశించి అన్నారో అందరికీ తెలిసిందే. ఏపీ, తెలంగాణాల నుంచి నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరారు. అందులో ఇద్దరిమీద పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్నాయి. పైగా వారు ఇప్పటికీ టీడీపీకి సన్నిహితంగా ఉంటున్నారన్న ప్రచారమూ ఉంది. అంటే అధికార బీజేపీ ద్వారా కధ నడిపించుకోవాలన్న వారిఆలోచనలపైన మీడియా కధనాలు వెలువడ్డాయి. వీటన్నిటికీ ఒకే జవాబు అన్నట్లుగా మురళీధరరావు కుండబద్దలుకొట్టారు. ఎవరో వచ్చి చేరినంత మాత్రాన బీజేపీ డీఎన్ఏ మారదని కూడా ఆయనక్లారిటీగా చెప్పేశారు.ఇక గత కొన్నాళ్ళుగా ఏపీ బీజేపీలో కొత్త పూజారుల హడావుడి బగా పెరిగిపోయింది. పాత వారిని సైతం కాదని వీరే ముందు వరసలోకి వచ్చేస్తున్నారు. బీజేపీ సిధ్ధాంతాలనుకూడా వారే చెప్పేస్తున్నారు, కేంద్రం అలా చేస్తుంది. ఇలా చేస్తుంది అంటూ విధానపరమైన విషయాలను కూడా చెప్పుకుంటూ వైసీపీ సర్కార్ని టార్గెట్ చేయడం, తమ మాజీ రాజకీయ పార్టీ టీడీపీమాటలనే వల్లే వేయడం చేస్తున్నారు. దీంతోనే మురళీధరరావు వంటి వారు ఈ రకంగా స్పందించారని అంటున్నారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం అమరావతి రాజధాని విషయంలో కేంద్రంజోక్యం ఉండదని, మార్చాలా? వద్దా? అన్నది ఏపీ సర్కార్ ఇష్టమైని కూడా అప్పట్లో చెప్పుకొచ్చారు. . వీరే కాకుండా మిగిలిన తెలంగాణా బీజేపీ నేతలు కూడా ఏపీ బీజెపీ నేతల వైఖరికి భిన్నంగానే. బాబు బాటలో నడిస్తే మళ్ళీ బీజేపీకి భవిష్యత్తు ఉండదన్నది వారి అభిప్రాయంగా కనిపిస్తోంది. కేంద్రంలోని నాయకులు జీవీఎల్ నర సింహారావు, సురేష్ రెడ్డి సైతం ఏపీ బీజేపీ నేతలపోకడలతో విభేదిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే బీజేపీ పక్కన చేరి ఏదో చేయాలనుకుంటున్న వారికి, వారిని పంపించిన వారికి కూడా బీజేపీ కేంద్ర నాయకత్వం ఈ విధంగా గట్టి హెచ్చరికలనేపంపుతోంది

No comments:

Post a Comment