Breaking News

11/09/2019

పోషణ్ అభియాన్.. (నెల్లూరు)

నెల్లూరు, సెప్టెంబర్ 11 (way2newstv.in):
 పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించి, ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా, అలాగే గర్భవతులకు, కిశోర బాలికలకు రక్తహీనత సమస్య తలెత్తకుండా అంగన్‌వాడీకేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందించాల్సి ఉంది. ఇందుకు గాను ప్రతి ఏటా సెప్టెంబరు మాసంలో ప్రభుత్వం పోషణ అభియాన్‌ కింద వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అయితేఅంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న పోషకాహారంలో నాణ్యత ప్రమణాలు ఉండటం లేదు. చౌకదుకాణాల్లో అందిస్తున్న నాసిరకం బియ్యంతో అన్నం.. ముక్కిన కందిపప్పుతో కూర... తక్కువపరిమాణంలో గుడ్లను అందిస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో కుళ్లిన, చెడిపోయిన గుడ్లనే సరఫరా చేస్తున్నారు. ఈ భోజనంతో పిల్లలకు పౌష్టికాహారం అందక పోగా... కడుపు నొప్పితో, అన్నం తిన లేక, బక్కచిక్కిపోతున్నారు. మూడేళ్ల నుంచి అయిదేళ్ల లోపు పిల్లలు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉంటారు. వీరు మధ్యాహ్నం నిద్ర తరువాత సాయంత్రం సమయాల్లో గతంలో గుగ్గిళ్లు, చక్కిలు, ఇతర స్నాక్స్‌లు,పాలు ఇచ్చేవారు.
 పోషణ్ అభియాన్.. (నెల్లూరు)

అయితే గత మూడేళ్ల నుంచి వీటిని నిలిపేశారు. దీంతో సాయంత్రం నాలుగు గంటల వరకు పిల్లలు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉండాలంటే అలసి పోతున్నారు. పిల్లల్లో, గర్భవతుల్లోపోషకహార లోపాన్ని, రక్తహీనత నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టడం లేదు. జిల్లాలో 3774 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. పట్టణ ప్రాంతాల్లో మూడేసి కేంద్రాలను కలిపి ఫ్రీమోడల్‌ స్కూల్‌గాతీర్చిదిద్ది, సుందరంగా ఏర్పాట్లు చేశారు. అయితే ఆహారం విషయంలో మాత్రం కోత పెట్టారు. 7 నెలల నుంచి 3 సంవత్సరాల లోపు పిల్లలకు బాల అమృతం ప్యాకెట్లు, వారానికి రెండు గుడ్లు ఇళ్లకుఅందిస్తారు. అలాగే కేంద్రాలకు వచ్చే 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు వారానికి నాలుగు గుడ్లు, మధ్యాహ్నం భోజనం అందిస్తారు. భోజనంలో కూడా సోమవారం సాంబారు, మంగళవారం టమాటాపప్పు, బుధవారం ఆకుకూర పప్పు, మిగిలిన మూడు రోజులు కూడా ఇదే పద్దతిగా వండిస్తారు. అలాగే గర్భిణులు, బాలింతలకు వారానికి ఉడకబెట్టిన ఆరు గుడ్లు, మధ్యాహ్నం భోజనం అందించాల్సిఉంది. అయితే ఇవి నాసిరకంగా ఉండటంతో ఎక్కువ మంది గర్భవతులు, బాలింతలు భోజనాలు చేయడం లేదు. ప్రతినెల ఆయా వైద్యాధికారులు పరీక్షలు నిర్వహించి, లోపాలు నమోదు చేసివెళుతున్నా, అందుకు తగ్గట్టుగా పౌష్టికాహారం ఆదనంగా ఐ.సి.డి.ఎస్‌. అధికారులు కేటాయించడం లేదు. బాల సంజీవని కింద ఎస్సీ, ఎస్టీ గర్భవతులకు, బాలింతలకు ఆదనంగా రాగి జావ కోసం రాగిపిండి, బెల్లం, మల్టీగ్రైన్‌ ఆట, ఎండు ఖర్జూరాలు అందించేందుకు 13370 మందిని గుర్తించారు. అయితే ఇతర వర్గాలకు చెందిన గర్భవతులకు రక్తహీనత ఉంటే వీరికి కూడా అందించాల్సి ఉన్నా,ఆమేరకు చర్యలు చేపట్టడం లేదు. అలాగే గత రెండు నెలల నుంచి బాలసంజీవని కింద సరుకులు సక్రమంగా సరఫరా చేయడం లేదు.పోషణ అభియాన్‌ కింద సెప్టెంబరు మాసం అంతా గర్భవతులు, పిల్లలు, బాలింతలకు పౌష్టికాహార ప్రాధాన్యం గురించి వివరించేలా ప్రణాళికను రూపొందించారు. ఇందులో మొదటి వారంలో ఆహారపదార్ధాల ప్రదర్శన, ఆరోగ్యం, పరిశుభ్రతపై వైద్యుల ప్రసంగం, గర్భిణులకు సీమంతాలు, పిల్లలకు అన్నప్రాసనం, గృహ సందర్శన, అంగన్‌ వాడీ కేంద్రాల్లో అందించే సౌకర్యాలపై అవగాహన కల్పిస్తారు.రెండో వారంలో గర్భణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిల్లలకు టీకాలు వేయించేలా, బరువు తగ్గ పిల్లలను గుర్తిస్తారు. పూర్తయిన అంగన్‌వాడీ భవనాల ప్రారంభోత్సవం, సెక్టార్ల వారిగా సమావేశం,గార్డెన్స్‌ ఏర్పాటు వంటి కార్యక్రమాలు చేపడతారు. మూడో వారంలో పరిశుభ్రతపై అవగాహన, చేతులు కడుక్కోవడంపై వివరిస్తారు. నాల్గో వారంలో కిశోర బాలికలకు సరైన పోషణ, రుతుస్రావంసమయంలో పాటించాల్సిన పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తారు. పోషణపై చర్చను ప్రతి గ్రామంలో జరిగేలా చర్యలు తీసుకుంటారు. నెల రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తాం

No comments:

Post a Comment