Breaking News

18/09/2019

మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు

ముంబై, సెప్టెంబర్ 18 (way2newstv.in)
దేశీ ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. బుధవారం పెట్రోల్, డీజిల్ ధరలు పైకి కదిలాయి. పెట్రోల్ ధర 27 పైసలు, డీజిల్ ధర 26 పైసలు చొప్పున పెరిగింది. దీంతో హైదరాబాద్‌‌లో పెట్రోల్ ధర రూ.76.99కు చేరింది. డీజిల్ ధర రూ.71.75కు ఎగసింది. దేశంలోని ఇతర నగరాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. ఎప్పుడూ దాదాపు 10 పైసలులోపు పెరుగుతూ తగ్గతూ వస్తున్న దేశీ ఇంధన ధరలు నేడు 25 పైసలుకు పైగా పెరిగాయి. సౌదీ ఆరామ్‌కోపై డ్రోన్ ఎటాక్ ఇందుకు కారణం.
మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు

అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర 26 పైసలు పెరుగుదలతో రూ.76.71కు చేరింది. డీజిల్‌ ధర కూడా 25 పైసలు పెరుగుదలతో రూ.71.13కు ఎగసింది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 26 పైసలు పెరుగుదలతో రూ.76.34కు చేరింది. డీజిల్ ధర కూడా 25 పైసలు పెరుగుదలతో రూ.70.79కు ఎగసింది.దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 25 పైసలు పెరుగుదలతో రూ.72.42కు చేరింది. డీజిల్ ధర కూడా 24 పైసలు పెరుగుదలతో రూ.65.82కు ఎగసింది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర 25 పైసలు పెరుగుదలతో రూ.78.10కు చేరింది. డీజిల్ ధర కూడా 26 పైసలు పెరుగుదలతో రూ.69.04కు ఎగసింది.అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు  ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.09 శాతం తగ్గుదలతో 63.50 డాలర్లకు దిగొచ్చింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.42 శాతం తగ్గుదలతో 59.09 డాలర్లకు క్షీణించింది

No comments:

Post a Comment