Breaking News

17/09/2019

క్యాన్సర్ వ్యాధి వచ్చిన చిన్నారికి ఎమ్మెల్యే చేయూత..

మెరుగైన వైద్యం  అందించాలని  ఒమేగా  వైద్యులకు  ఆదేశం
కర్నూలు సెప్టెంబర్ 17  (way2newstv.in)
నగరంలోని  అశోక్ నగర్ కు చెందిన  మణి,  మూర్తు జావలి  కుమార్తె  రేష్మ 7 సంవత్సరాల వయసులోనే  క్యాన్సర్ వ్యాధి తో   బాధపడుతుంది.  చికిత్స కోసం   వెళితే  ఆధార్,   రేషన్ కార్డు లేకపోవడంతో  సరైన చికిత్స అందలేదు.  ఆ దంపతులు  ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్  వద్దకు వచ్చి  విషయాన్ని    విన్నవించారు.  
క్యాన్సర్ వ్యాధి వచ్చిన చిన్నారికి   ఎమ్మెల్యే  చేయూత..

స్పందించిన ఎమ్మెల్యే  యుద్ధ ప్రాతిపదికన  ఈ చిన్నారి వైద్య సేవల నిమిత్తం  ఆధార్,  రేషన్ కార్డు  మంజూరు చేయాలని    తాసిల్దార్ కు  ఆదేశాలు జారీ చేశారు.  వెంటనే  వారికి   రేషన్ కార్డు మంజూరు చేశారు.  ఆ చిన్నారికి  వైద్య సేవలు అందించేందుకు  ఒమేగా  ఆస్పత్రి సిబ్బంది  ముందుకు వచ్చారు.  వీరికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి వర్గాలను ఎమ్మెల్యే  ఆదేశించారు.  వైద్య ఖర్చుల నిమిత్తం  ఎమ్మెల్యే  రూ.5 వేల రూపాయలు  ఆర్థిక సహాయం  అందించారు.  గత మూడు సంవత్సరాలుగా  తమ కూతురికి  ఎవరు సహాయం అందించలేదని  ఎమ్మెల్యే సహకారంతో వైద్యం అందుతుందని  ఈ సందర్భంగా వారం  ఎమ్మెల్యేకు  కృతజ్ఞతలు తెలిపారు.

No comments:

Post a Comment