Breaking News

28/09/2019

వెంటాడుతున్న అనుమానం

ముంబై, సెప్టెంబర్ 28 (way2newstv.in)
మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపు పై ధీమా ఉన్నప్పటికీ ఎక్కడో అనుమానం మాత్రం బీజేపీ కూటమిలో ఉంది. బీజేపీ, శివసేనల మధ్య పొత్తుతో బరిలోకి దిగినప్పటికీ ఈసారి మరోరూపంలో ఈ కూటమికి ప్రమాదం పొంచి ఉందన్న అంచనాలు వినపడుతున్నాయి. మహారాష్ట్రలోని 288 నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాల్లో మరాఠీ ఓటర్లు ప్రభావం చూపనున్నారు. వారు గెలుపోటములను నిర్ణయించనున్నారు. వారు ఎటువైపు మొగ్గు చూపితే అటువైపే విజయం సిద్ధిస్తుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అందుకే ఇప్పుడు అన్ని పార్టీలూ మరాఠీ ఓటర్లపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు.మరాఠీ ఓటర్లు ఎక్కువగా భారతీయ జనతా పార్టీ, శివసేనలవైపే మొగ్గు చూపుతారనడంలో అతిశయోక్తి లేదు. సెంటిమెంట్ బలంగా ఉంది. ముఖ్యంగా శివసేన మరాఠీల ప్రయోజనాలను ఎప్పటికప్పుడు కాపాడుతూ వస్తుంది. 
వెంటాడుతున్న అనుమానం

ఇక బీజేపీ కూడా అధికారంలో ఉన్నప్పుడే మరాఠా రిజర్వేషన్లను అమలుపర్చారు. రిజర్వేషన్ల అమలు పర్చడంతో ఆ ఓటర్లు తమవైపు సానుకూలంగా ఉండే అవకాశాలున్నాయిని కమలనాధులు అంచనాలు వేస్తున్నారు.మరాఠీ ఓటర్లు దాదాపు 200కు పైగా నియోజకవర్గాల్లో ప్రభావం చూపనున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నవనిర్మాణ సేన పోటీ చేయలేదు. రాజ్ థాక్రే నేతృత్వంలోని ఎంఎన్ఎస్ పక్కా మరాఠా పార్టీగా ముద్రపడింది. ఈ సారి ఎన్నికల్లో ఎంఎన్ఎస్ బరిలోకి దిగనుంది. అనేక నియోజకవర్గాల్లో మరాఠీ ఓటర్లను ఎంఎన్ఎస్ ఆకర్షించే అవకాశముంది. గత శాసనసభ ఎన్నికల్లో ఎంఎన్ఎస్ డీలా పడినప్పటికీ రాజ్ థాక్రే ఈ ఐదేళ్లలో ఒంటరిగానే మరాఠాల తరుపున గళం విన్పించడంతో ఆయనకు ఆ వర్గంలో సానుకూలత ఏర్పడిందంటున్నారు.ఈసారి ఎన్నికల్లో మరో కొత్త పార్టీ కూడా బరిలోకి దిగనుంది. బహుజన్ వంచిత్ అఘాడి పార్టీ కూడా మారాఠీ ఓట్లను చీల్చే అవకాశముండటంతో బీజేపీ, శివసేనలు అప్రమత్తమయ్యాయి. ఎంఎన్ఎస్, బహుజన్ వంచిత్ అఘాడి పార్టీలు మరాఠీల ఓట్లు చీల్చకుండా ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే అధికార పార్టీకి ఎక్కువ మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండటంతో వారిపై తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. మరి ఈ నేపథ్యంలో బీజేపీ కూటమి మహారాష్ట్ర ఎన్నికలను ఎలా నెగ్గుకొస్తుందో చూడాల్సి ఉంది.

No comments:

Post a Comment