Breaking News

05/09/2019

క్రేజీ క్రేజీగా మొక్కల పెంపకం

వరంగల్, సెప్టెంబర్ 5, (way2newstv.in)
ప్రజల అభిరుచికి తగ్గట్టుగా నిర్వాహకులు వివిధ రకాల మొక్కలు అందుబాటులో ఉంచుతున్నారు. నగరంలోని డివైడర్లలో ఫైకస్‌ జాతి మొక్కలను మనం రోజూ చూస్తూనే ఉంటాం. వాటిపై మన దృష్టి అంతగా పోదు. నిర్వాహకులు నర్సరీల్లోని ఇటువంటి మొక్కలను కొబ్బరి తాళ్లలో పొందికగా కట్టుకుంటూ దానికి ఒక ఆకారాన్ని ఇస్తుండటంతో అవి చూపరులను అమితంగా ఆకర్శిస్తున్నాయి. శుభకార్యాలు జరుపుకొనే కొంతమంది పచ్చదనాన్ని ఇష్టపడుతుండటంతో వారి అభిరుచికి తగ్గట్టుగా నర్సరీ నిర్వాహకులు కుండీ మొక్కలను బాడుగకు ఇస్తున్నారు. దీంతో శుభకార్యాల్లో వాతావరణం పచ్చదనంతో నిండి బంధుమిత్రులకు ఆహ్లాద వాతావరణం ఆహ్వానం పలుకుతోంది.ఇందులో ప్రధానంగా నీడలో పెరిగే మొక్కలు, పూల మొక్కలు, కుండీల్లో పెరిగే పండ్ల మొక్కలున్నాయి. ముఖ్యంగా గులాబీలో 15 రకాల రంగులున్న జాతులను నగరవాసులు అమితంగా ఇష్టపడుతున్నారు. వీటితోపాటు పది రంగుల్లో ఉన్న మందార మొక్కలు అందుబాటులో ఉన్నాయి. 
 క్రేజీ క్రేజీగా  మొక్కల పెంపకం

పండ్ల మొక్కల్లోనైతే జామ, మామిడి, బత్తాయి వంటి 20 రకాలను విక్రయిస్తున్నారు. ఇంటి ఆవరణలో పెంచుకునే మొక్కలే కాకుండా కుండీల్లో పెంచుకునే నీడనిచ్చే, అలంకరణకు పెంచే మొక్కలు సుమారు వంద రకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధానంగా మనీప్లాంటు, ఫైకస్‌ జాతి, ఆర్కిడ్‌లు, క్రిస్‌మస్‌ మొక్కలు వంటి వాటితోపాటు చిన్న కుండీల్లో పెంచే వివిధ రకాల నీడ జాతి మొక్కలు ఉన్నాయి.మొక్కలు కొనుగోలు చేసిన చోటే అవి ఆరోగ్యంగా పెరిగేందుకు ఉపకరించే సేంద్రియ ఎరువులైన వర్మీకంపోస్టు, కొబ్బరి పీచుతో చేసిన ఎరువులు, రోజ్‌ మిక్స్‌, పోషకాలతో కూడిన మట్టి అందుబాటులోకి వచ్చింది. వీటితోపాటు నేలపై ఏర్పాటు చేసే కుండీలు, ఇంటి ఎదుట వేలాడదీసే కుండీలు ఆకర్షిస్తున్నాయి. మట్టి, కుండీలకోసం వేరే ప్రాంతానికి వెళ్లే ప్రయాస తప్పుతోంది.ఆదాయాన్ని పెంచుతున్న టేకు మొక్కలు తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తమవంతు కర్తవ్యంగా రైతులు టేకు మొక్కల పెంపకం చేపడుతున్నారు. ప్రభుత్వం సైతం ఇందుకు ప్రోత్సాహకం అందిస్తుండటంతో మొక్కలు పెంచేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం ఉచితంగా అందించే టేకు మొక్కల పెంపకానికి వర్షాకాలం అనుకూలమైన సమయం. ఆసక్తి ఉన్న రైతులు మొక్కలు పెంచేందుకు పేర్లు నమోదు చేసుకుంటే, నర్సరీల నుంచి మొక్కలను అందించే ఏర్పాట్లు చేస్తారుమండలంలో గత మూడేళ్లుగా రైతులు ఖాళీ ప్రదేశాలు, పొలాలు, కాల్వ గట్లపై గుంతలు తవ్వి పెద్ద మొత్తంలో టేకు మొక్కలు నాటుతున్నారు.టేకు మొక్కలను పెంచితే దీర్ఘకాలంలో లాభసాటి ఆదాయం ఆర్జించవచ్చు. ఎలాంటి పెట్టుబడి లేకుండా గట్లపై పెంచి 25 ఏళ్ల తర్వాత లాభాలు పొందవచ్చు. సాగుకు అనుకూలంగా లేని నీటివసతి తక్కువగా ఉన్న భూముల్లోనూ ఈ మొక్కలను పెంచవచ్చు. టేకును పెంచే ఆసక్తి ఉన్న రైతులకు ప్రభుత్వం ఉచితంగా మొక్కలను అందిస్తోంది. ఉపాధి హామీ సిబ్బంది వద్ద రైతులు పేరు నమోదు చేసుకుంటే, అధికారులు మొక్కలను అందజేస్తారు. ఉపాధి హామీ పథకంలో టేకు మొక్కలు నాటిన రైతులకు, వాటి నిర్వహణకయ్యే మొత్తం ఖర్చులను అందిస్తారు. నాటినప్పటి నుంచి ఎరువులు, కలుపుతీత, నీరందించేందుకు ఒక్కో మొక్కకు నెలకు రూ.5 చొప్పున చెల్లింపులు చేస్తారు. వర్షాలు లేని సమయంలో నీటి తడులిస్తూ, సేంద్రియ ఎరువులు చల్లుతుంటే మొక్కలు తొందరగా పెరుగుతాయి. 20 నుంచి 25 ఏళ్లపాటు పెంచితే, చెట్టు బలంగా పెరిగి మంచి ఆదాయం లభిస్తుంది.లాభసాటి ఆదాయం ఉంటుందని ఖాళీ స్థలంలో టేకు మొక్కలను పెంచాం. కేవలం మొక్కలు నాటడమే కాకుండా, వాటిని జాగ్రత్తగా సంరక్షిస్తున్నాం. ప్రభుత్వం సైతం మొక్కల పెంపకానికి ఆర్థికంగా చేయూతనిస్తుండటంతో మొక్కల పెంపకం సులువవుతోంది. ప్రస్తుతం లాభాలు ఆశించకుండా భవిష్యత్తులో ఆదాయం వస్తుందని మొక్కలు పెంచుతున్నాం.టేకు మొక్కల పెంపకంపై రైతులకు అవగాహన కల్పించాం. రైతులు కూడా టేకు సాగుకు ఆసక్తి చూపుతున్నారు. రైతులకు సరిపడా మొక్కలు అందిస్తున్నాం. కొరత ఏర్పడినప్పుడు ఇతర ప్రాంతాల నుంచి మొక్కలు తీసుకొచ్చి పంపిణీ చేస్తున్నాం. టేకు సాగు దీర్ఘకాలంలో మంచి ఫలితాలనిస్తుంది

No comments:

Post a Comment