హైద్రాబాద్, సెప్టెంబర్ 5, (way2newstv.in)
రేషన్ దుకాణాల్లో ఈ-పోస్ యంత్రాలు పెట్టడంతో అంతా సక్రమంగా పంపిణీ జరుగుతుందని చెబుతున్నారు. గతంలో డీలర్ల అక్రమార్జనకు కళ్లెం పడిందని ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటికీ సబ్సిడీ బియ్యాన్ని కొందరు డీలర్లు అక్రమంగా అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న ఉదంతాలు అక్కడక్కడ వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ-పోస్ యంత్రాలను ప్రవేశపెట్టిన ప్రభుత్వం చాలా వరకు అక్రమ వ్యాపారాన్ని అరికట్టింది. అయితే కిరోసిన్ పంపిణీ మాత్రం ఈ-పోస్‌తో ప్రమేయం లేకుండా నేరుగా కార్డుదారులకు ఇచ్చే విధానం నడుస్తోంది. దీన్ని అవకాశంగా చేసుకొని ఎన్‌ఆర్, రేషన్‌షాపు డీలర్లు కిరోసిన్‌తో లాభపడుతున్నారు. కేవలం పలానా కార్డుదారుడికి కిరోసిన్ ఇచ్చామని రికార్డుల్లో రాసుకొని లెక్కలు చూపితే సరిపోతుంది. ఇది డీలర్లకు అవకాశంగా మారింది.
యదేఛ్చగా బ్లూ కిరోసిన్ పక్కదారి
అడిగిన కొంతమందికి మాత్రం కిరోసిన్ ఇస్తున్నారేతప్ప.. దాదాపుగా అధికశాతం కిరోసిన్ నల్లబజారులో రెండింతల అధిక ధరకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఈ అక్రమ వ్యవహారంపై విజిలెన్స్, పౌర సరఫరా అధికారులకు పక్కా సమాచారం ఉంది. ఇప్పటికే పలు దుకాణాలపై కేసులు నమోదు చేశారు. అయినప్పటికీ డీలర్లు నెలవారీ మామూళ్లు, ప్రత్యేక తనిఖీల సమయంలో అదనంగా ఖర్చు పెడుతూ తమ అక్రమ వ్యాపారాన్ని మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు.నిజమే ఫిర్యాదులు ఉన్నాయి .ఇవే దుకాణాలతో పాటు, ప్రత్యేకంగా కిరోసిన్ పంపిణీ చేసేందుకు ఏర్పాటుచేసిన ఎన్‌ఆర్ షాపుల్లో అక్రమ వ్యవహారం యథేచ్చగా కొనసాగుతోంది. సబ్సిడీలో వస్తున్న కిరోసిన్‌ను అక్రమమార్గంలో విక్రయిస్తూ.. రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు ఎన్‌ఆర్ డీలర్లు సిండికేట్‌గా మారి నాలుగైదు దుకాణాల కిరోసిన్‌ను ఒకేచోట నిల్వచేసి నల్లబజారుకు తరలిస్తున్నారు. విజిలెన్స్ అధికారులు సైతం ఎన్‌ఆర్ షాపులపై నమోదు చేస్తున్న కేసులు దీనికి బలం చేకూరుస్తున్నాయి. అసలు కొన్ని ప్రాంతాల్లో ఎన్‌ఆర్ షాపులు ఎక్కడున్నాయో తెలియదు. మరికొన్ని చూసేందుకు కనిపిస్తున్నా.. ఎప్పుడు తెరుస్తారో తెలియని పరిస్థితి ఉంది. బాలానగర్ పౌర సరఫరా సర్కిల్ పరిధిలోని ఎన్‌ఆర్ షాపుల్లో జరుగుతున్న అక్రమాల చిట్టా ఇదీ.బాలానగర్ పౌర సరఫరాల సర్కిల్ పరిధిలో మొత్తం 100వరకు ఎన్‌ఆర్ షాపులు ఉండాలి. ప్రస్తుతం ఇందులో కొన్ని విజిలెన్స్ కేసులతో మూతపడగా.. మరికొందరు అనధికారికంగా మరో ఎన్‌ఆర్‌తో కలిసి నడుపుతున్నవి కొన్ని ఉన్నాయి. బినామీ పేర్లతో నడిపే దుకాణాలు ఇంకొన్ని ఉంటాయి. వీటితో పాటు సర్కిల్‌లోని 227 రేషన్ దుకాణాల్లోనూ కిరోసిన్ సరఫరా అవుతోంది. గతంలో వీటి నుంచి మాత్రమే కిరోసిన్ సరఫరా అయ్యేది. అయితే ప్రత్యేకంగా ఎన్‌ఆర్ దుకాణాలను ఏర్పాటుచేసి వాటికి కార్డులను కేటాయించారు. ఇలా రేషన్ దుకాణం, ఎన్‌ఆర్ రెండింటిలోనూ ప్రతినెల సబ్సిడీ కిరోసిన్ సరఫరా అవుతోంది. ఒక్కో కార్డుదారుడికి ఒక లీటర్ చొప్పున ప్రభుత్వం కిరోసిన్ సరఫరా చేస్తోంది. ఇలా సర్కిల్‌లోని కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి నియోజవర్గాలలోని 1.89లక్షల కార్డుదారులకు కలిపి ప్రతినెల 1.89లక్షల లీటర్ల కిరోసిన్ ప్రభుత్వం సరఫరా చేస్తోంది.
No comments:
Post a Comment