Breaking News

12/08/2019

జీతం తక్కువైనా ఉద్యోగం పెద్దదే

ఏలూరు, ఆగష్టు 12 (way2newstv.in)
జీతం తక్కువైనా ఉద్యోగం పెద్దదేనని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) చెప్పారు. స్థానిక శ్రీరామ్ నగర్ లోని మంత్రి కేంపు కార్యాలయంలో సోమవారం ఏలూరు సమీపంలోని వెంకటాపురం పంచాయతీలో 20 మంది గ్రామ వాలంటీర్లకు నియామక పత్రాలను  నాని అందజేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే  జగన్ నిరుద్యోగ యువతకు 4 లక్షల ఉద్యోగాలు కల్పనకు చర్యలు తీసుకున్నారని చెప్పారు. 
జీతం తక్కువైనా ఉద్యోగం పెద్దదే 

గ్రామవాలంటీర్ ఉద్యోగం చేయడం సామాజిక సేవ క్రింద భావించాలని జీతం తక్కువని బాధపడవద్దని పనితీరు ఆధారంగా భవిష్యత్‌లో ప్రభుత్వం వేతనాలు పెంచుతుందని  నాని చెప్పారు. 50 కుటుంబాల సంక్షేమాన్ని చూసే బాధ్యత గ్రామవాలంటీర్లకు అప్పగించారంటే పేదలకు పరోక్షంగా సేవ చేసినట్లేనని వాలంటీర్ ఉద్యోగం భవిష్యత్ లో ఎంతో కీలకం కానుందని శ్రీ నాని చెప్పారు. ఉద్యోగులకు అండగా ఉంటామని ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి యువతకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తుంధని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామవాలంటీర్లతోపాటు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనాయకులు తంగెళ్ల రాము తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment