Breaking News

12/08/2019

నిండుకుండలా తుంగభద్ర

మంత్రాలయం ఆగస్టు,12  (way2newstv.in)
ఎగువ ప్రాంతంలో కర్ణాటక రాష్ట్రంలో పడుతున్న భారీ వర్షాలకు తుంగభద్ర డ్యామ్ నిండిపోయింది. దీంతో డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో వరద నీరు వర్షం నీరు తుంగభద్ర నదిలోకి వదిలారు .దీంతో తుంగభద్ర నది  నిండుకుండలా  నిండు ముత్తయిదువులా  వడివడిగా అడుగులు వేస్తూ చెట్లను పుట్లను  నువ్వుతూ పలకరిస్తూ పనిలోపనిగా సెలయేళ్లను  కూడా పలకరిస్తూ నేను వచ్చాను అని ధైర్యం చెబుతూ సమస్త జీవరాశులకు ఆనందాన్ని అందిస్తూ,  సంతోషాన్ని పంచుతూ  ముందుకు సాగుతూ అడుగులు వేస్తోంది. చాలా రోజులుగా ఎడారిగా మారిన తుంగభద్రా నది తెల్లారేసరికల్లా నిండు కుండలా ఉండడం చూసి మంత్రాలయం ప్రజలు మరచిపోయారు. 
నిండుకుండలా  తుంగభద్ర

మరో రెండు రోజుల్లో రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు జరగనున్నాయి. భక్తులకు ప్రజలకు నీళ్లు లేక పోతే ఎంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని అనుకుంటున్న సమయంలో గ్రామదేవత మంచాలమ్మ అనుగ్రహము,రాఘవేంద్రస్వామి మహిమ వల్ల   తెల్లారేసరికల్లా తుంగభద్రా నది కలకలలాడుతూ  జలజలా పారుతున్న దృశ్యం ప్రజలను ఆనంద తాండవం చేయిస్తోంది రాఘవేంద్ర స్వామి పట్ల గ్రామదేవత మంచాలమ్మ పట్ల   గ్రామస్తులు  భక్తి భావాలతో మైమరచిపోతున్నారు.. ఆదివారం రాత్రికి డ్యామ్ నీరు మంత్రాలయం చేరుకొని గలగలా పారుతూ ముందుకు సాగిపోతోంది .దీంతో తీర గ్రామ ప్రాంతాల ప్రజలు ఒకవైపు సంతోషంగా ఉన్నా రెండోవైపు వరదల రూపంలో ఆపద వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. శ్రీ మఠం పీఠాధిపతులు సోమవారం ఉదయం శ్రీ మఠం  వెనుకభాగంలోని నది ని సందర్శించారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని వర్షం నీరు ఇంత కంటే కొంచెం ఎక్కువ రావాలి అంతే గాని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దుకాణదారులకు మంత్రాలయం గ్రామ ప్రజలకు తెలియజేశారు.  మంత్రాలయం సీఐ కృష్ణయ్య ఎస్సై మధుసూదన్ ఎర్రన్న పోలీస్ సిబ్బంది శ్రీమఠం  అధికారులు తుంగభద్ర నది ని సందర్శించిన వారిలో ఉన్నారు. మంత్రాలయం కు వచ్చిన భక్తులు నదిలో స్నానానికి వెళ్ళకూడదు అని హెచ్చరికలు జారీ చేశారు. చాలా రోజుల తర్వాత తుంగభద్రమ్మ పరవళ్లు తొక్కుతూ నిండుకుండలా సెలయేరులా పారుతున్న తుంగభద్రమ్మను చూడటానికి ప్రజలు వేల సంఖ్యలో వచ్చి చూస్తున్నారు.ఒకవైపు సంతోషంగా ఉన్నా మరోవైపు మనసులో ఆందోళన చెందుతున్నారు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదని అధికారులు ప్రజలకు తెలియ చేస్తున్నారు.

No comments:

Post a Comment