Breaking News

12/08/2019

యువజన దినోత్సవం

ఒంగోలు, ఆగస్టు 12,(way2newstv.in - Swamy Naidu):
అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా యువజన సర్వీసుల శాఖ, స్టెప్ ఆద్వర్యంలో జవహర్ నవోదయ విద్యాలయం,  ఒంగోలు లో అంతర్జాతీయ యువజన దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్  టి.జయశ్రీ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యనిర్వహణాధికారి  స్టెప్.యం.ఎల్.నరసింహరావు  మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి యువత కోసం చేపట్టిన  ప్రపంచ కార్యాచరణ కార్యక్రమం పట్ల యువతకు అవగాహన కలిగించేందుకు అంతర్జాతీయ యువ దినోత్సవంను ప్రకటించింది. 
యువజన దినోత్సవం
మెదటి అంతర్జాతీయ యువ దినోత్సవం ఆగస్టు12,2000లో జరిగింది. ధరిత్రీ దినోత్సవం వంటి ఇతర రాజకీయ అవగాహన దినోత్సవాల మాదిరిగా ఈ దినోత్సవమును జరుపుకోవడం వలన యువత దృష్టిని ఆకర్షించడం ద్వారా ప్రయెజనం చేకూరుతుంది. సాంస్కృతిక చట్టపరమైన సమస్యలు ద్వారా అపాయంలో చిక్కుకున్న జనాభాకు ఇటువంటి దినోత్సవాల అవసరం ఉందని తెలిపినారు, ఈ కార్యక్రమంలో జిల్లా యువజన  సంక్షేమ శాఖ కార్యపర్యవేక్షకులు డి.సహోదర రావు, స్టెప్ సిబ్బంది ప్రసాద్, 403 విద్యార్ధిని విద్యార్దులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment