Breaking News

13/08/2019

.పోలీసులు నైపుణ్యం పెంచుకోవాలి

మమబూబ్ నగర్ ఆగస్టు 13,(way2newstv.in -Swamy Naidu):
నేరగాళ్ళ విస్తృతి పెరిగిన నేపథ్యంలో, పోలీసు పరిశోధనలో పదును పెంచుకోవడం అవశ్యమని, అల్లరి మూక అరాచకాలను కట్టడి చేసేందుకు మనదైన వృత్తిపరమైన నైపుణ్యాలను పూర్తిస్థాయిలో వినియోగించాలని ఎస్.పి. రెమా రాజేశ్వరి సూచించారు. మంగళవారం నాడు జరిగిన  జిల్లా స్థాయి శాంతిభద్రతల సమీక్ష సమావేశంలో  ఆమె మాట్లాడారు.  వివిధ సందర్భాలలో మన బందోబస్తులు విజయం దిశగా సాగినా, అలసత్వం దరి చేరనీకపోవడంతో పాటుగా అక్కడక్కడ జరిగిన లోపాలు సరిదిద్దుకోవడం మనలను ధీటుగా తయారుచేస్తుంది. పోలీసు వృత్తిలో ఇక అయిపోయిందని ఊపిరి పీల్చుకోవడం ఉండదు, మరో సవాలు మన ఎదురుగా నిల్చుని పలకరిస్తుంది.
పోలీసులు నైపుణ్యం పెంచుకోవాలి
 స్వీకరించడానికి, శక్తివంతమైన ఆలోచనలతో పని చేసి సమాజానికి శాంతి అందించటానికి సిద్ధంగా ఉండడమే పోలీసు వృత్తిలోని ప్రత్యేకత. క్షేత్ర స్థాయిలో సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమైనది, ఎల్లవేళలా ఇదే స్ఫూర్తితో పని చేయాలని ఎస్.పి. సూచించారు. అదేవిధంగా ఇటీవల కాలంలో నేర పరిశోధన, నేరగాళ్లకు శిక్ష ఖరారు, బాల కార్మికుల నిరోధన, షీ బృందాలు, పోలీసు స్టేషన్లలో వివిధ సందర్భాలలో నైపుణ్యాలను ప్రదర్శించిన అధికారులు, సిబ్బంది (25) మందికి ఎస్.పి. నగదు రివార్డులు అందజేశారు. సమావేశంలో అదనపు ఎస్.పి. ఎన్. వేంకటేశ్వర్లు, డి.ఎస్.పి.లు బి.భాస్కర్, శ్రీనివాస్ మరియు జిల్లాలోని ఇన్స్పెక్టర్లు, ఎస్.ఐ.లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment