Breaking News

13/08/2019

వాట్సప్ ఫిర్యాదుల విభాగం ప్రారంభం

వనపర్తి,  ఆగస్టు 13,(way2newstv.in - Swamy Naidu):
వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల సౌకర్యారార్థం వనపర్తి జిల్లాప్రజల నుండి వాట్సాప్, ఫేసుబుక్, ట్విట్టర్, ద్వారా ఫిర్యాదులు స్వీకరించడానికి ఏర్పాటు చేసిన  సోషల్ మీడియా ట్విట్టర్, ఫేసుబుక్ వాట్సప్, ప్రత్యేక  విభాగాన్ని వనపర్తి జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు మంగళవారం  ప్రారంభించారు. ఈ సందర్బగా ఎస్పీ   మాట్లాడుతూ . ప్రజలు వారి ఫిర్యాదులను నేరుగా పిర్యాదు చేయలేనివారు, దూరప్రాంతాల్లో ఉన్న వారు జిల్లా పోలీసు వాట్సాప్,ఫేసుబుక్, ట్విట్టర్,  ద్వారా పిర్యాదు చేయవచ్చు అన్నారు. నేటి ప్రపంచములో అత్యధిక మంది ప్రజలు వాట్సాప్,ఫేసుబుక్ ట్విట్టర్,  వంటి సామాజిక మాధ్యమాలను వినియోగిస్తూ అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారుని  ఈ యొక్కఅధునాతన  పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని పోలీసువారి సేవలు  ప్రజలకు మరింత చేరువ కావాలనే లక్ష్యంతో జిల్లా వ్యాప్తముగా వాట్సాప్,ఫేసుబుక్, ట్విట్టర్  సేవలు ప్రవేశపెట్టామన్నారు. 
వాట్సప్ ఫిర్యాదుల విభాగం ప్రారంభం
ఇందు కోసం  వాట్సప్ నెంబర్ 6303923208 ఫేసుబుక్ ఖాతా ఎస్పీవనపర్తి, ట్విట్టర్ హ్యండిల్ ఎస్పీ వనపర్తి పేర్ల మీద అకౌంట్లను కేటాయించామని తెలిపారు. ఈ వాట్సాప్, ఫేసుబుక్, ట్విట్టర్ , ద్వారా జిల్లా పరిధిలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో పోలీసు అధికారులకు సమాచారం చేరవేయవచ్చు అన్నారు. ప్రధానంగా పిర్యాదులు, నేరాలు, ఉమెన్ హారస్మెంట్స్, ఈవ్ టీజింగ్, రోడ్డు ప్రమాదాలు వెంటనే స్పందించి ఫోటోలు,వీడియోలు తీసి వాట్సప్,ఫేసుబుక్, ట్విట్టర్ల, ద్వారా సమాచారం చేరవేసి బాధితులకు సహాయం చేయవచ్చు అన్నారు. సమాచారం చేరవేసే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ప్రజలకు సులభంగా, వేగంగా సేవాలందించడానికి ఏర్పాటు చేసిన సోషల్   మీడియాకు  తప్పుడు సమాచారం, తప్పుడు ఫిర్యాదులు, చేయకుండా  పోలీసు వారికి సహకరించాలని ఎస్పీ అన్నారు. ఎల్లవేళలా వాట్సాప్,ఫేసుబుక్, ట్విట్టర్లలో సేవలు అందుబాటులో ఉండేందుకు జిల్లా పోలీసు కార్యాలయంలో సోషల్ మీడియాపై  శిక్షణ పొందిన ఇద్దరు సిబ్బందితో   ఐటికోరుటీంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. వాట్సాప్, ఫేసుబుక్, ట్విట్టర్ల,  ద్వారా ఆ విభాగం సమాచారాన్ని స్వీకరించి వెంటనే స్పందించిఆ పరిధిలోని డీఎస్పీ ఇన్స్పెక్టర్లు ,ఎస్సైల  దృష్టికి తీసుకెళ్లి పిర్యాదుల సమస్యలు పరిష్కరించి చర్యలు తీసుకుంటారని ఎస్పీ వివరించారు.

No comments:

Post a Comment