Breaking News

08/08/2019

జిల్లా వ్యాప్తంగా నులిపురుగుల నివారణకు చర్యలు

హైద్రాబాద్ , ఆగస్టు 08, (way2newstv.in):
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం  సందర్భంగా రాష్ట్ర పశుసంవర్ధక  శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముషీరాబాద్ ప్రభుత్వ  ఉన్నత పాఠశాలలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా  పాల్గొన్నారు. ఈ సందర్భంగా  మంత్రి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, ముఖ్యంగా విద్యార్ధి దశలో  ఆరోగ్యంగా ఉంటే గ్రహాణ శక్తి బాగుంటుందన్నారు. 1 నుండి  19 సంవత్సరాల పిల్లలు చాలా మంది రక్తహీనతతో బాధపడుతుంటారని దానికి కారణం నులిపురుగులేని తల్లిదండ్రులు గుర్తించాలన్నారు. నులిపురుగులను  నివారించేందుకు ప్రభుత్వం పాఠశాల విద్యార్ధులకు ఆల్ బెండాజోల్  మాత్రలను జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా అందజేస్తుందన్నారు. 
జిల్లా వ్యాప్తంగా నులిపురుగుల నివారణకు చర్యలు

ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే కాకుండా ప్రైవేట్ యాజమాన్యాలతో కూడా సంబంధిత శాతాధికారులు సమన్వయ పరచుకొని అందరికి ఆల్ బెండాజోల్ మాత్రలను ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా పిల్లలు  ఆహారం తీసుకునే ముందు తప్పనిసరిగా  చేతులు కడుక్కొవాలని సూచించారు.  శుభ్రమైన వాతావరణంలో ఉంటే చాలా వరకు రోగాల బారిన పడకుండా ఉండోచ్చని మంత్రి పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ,  విద్యాశాఖ లు  సమన్వయించుకొని జాతీయ నులి పురుగుల  నివారణ  దినోత్సవంలో  భాగంగా ఆల్ బెండాజోల్ మాత్రలు అందరికి చేరేలా చర్యలు  తీసుకొవాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. హైదరాబాదు జిల్లాలో సుమారు 10 లక్షల పై చిలుకు  పిల్లలకు ఆల్ బెండాజోల్ మాత్రలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలతో పాటు అంగన్ వాగీ కేంద్రాలలో కూడా ఈ మాత్రాలు అందజేస్తారని తెలిపారు. ముషీరాబాద్ శాసన సభ్యులు ముఠాగోపాల్ మాట్లాడుతూ వ్యక్తిగత శుభ్రత ఎంతో ముఖ్యమని తద్వారా విద్యార్ధి, దశలో ఆరోగ్యంగా ఉండేందుకు వీలు కలుగుతుందన్నారు. ప్రభుత్వం  చేపడుతున్న నులిపురుగుల నివారణ కార్యక్రమంలో అందించే మాత్రలను 1-19 సంవత్సరాల లోపు వారు సద్వానియోగపరచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తాము వేసుకోవడమే కాకుండా చుట్టు ప్రకాల ఉండే వారికి కూడా నులిపురుగుల నివారణ గురించి అవగాహన కల్పించాలన్నారు.జాయింట్ కలెక్టర్ రవి  మాట్లాడుతూ నులిపురుగుల వలన తరచూ పిల్లలు కడుపునొప్పి, వాంతులు తదితర అనారోగ్య సమస్యలతో  బాధపడుతూ చదువు పై సరైన శ్రద్ద చూపలేకపోతారన్నారు. తల్లిదండ్రులు దీన్ని దృష్టిలో పెట్టుకొని వారికి ఆల్ బెండా జోల్ మాత్రలు వేసుకునేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనివార్య పరిస్థితుల్లో 8 తేదిన మాత్రలను వేసుకోనట్లయితే ఆగస్టు 16 వ తేదిన  మాత్రలు తీసుకోవచ్చాన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.వెంకటి, జిల్లా విద్యాశాఖాధికారి వెంకట నర్సమ్మ, జిల్లా సంక్షేమాధికారి ఝాన్సీలక్ష్మి, డిఐఓ నాగర్జున, కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు నరేంద్ర యాదవ్ , విద్యార్ధిని, విద్యార్ధులు, తదితరులు పాల్గొన్నారు.  

No comments:

Post a Comment