Breaking News

09/08/2019

వానలతో పవర్ ఫుల్

హైద్రాబాద్, ఆగస్టు 9, (way2newstv.in)
శైలంలో 150 టిఎంసిల నీరు రావడంతో పాటు, కృష్ణ నది ప్రవాహ ఉధృతి కూడా 3 లక్షల క్యూసెక్కులు దాటడంతో తెలంగాణ జెన్ కో శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో నిర్దేశిత సామర్థ్యానికి మించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నది. 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు యూనిట్ల ద్వారా శ్రీశైలంలో 900 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం తెలంగాణ జెన్ కో కు ఉంది. అయితే నీటి ప్రవాహ ఉధృతి సానుకూలంగా ఉండడంతో గరిష్ట సామర్థ్యానికి మించి, 915 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అక్కడ జరుగుతున్నది. సోమవారం ప్రారంభమయిన విద్యుత్ ఉత్పత్తి మంగళవారం కూడా స్థిరంగా కొనసాగింది. రాబోయే కొద్ది రోజుల పాటు ఇదే ప్రవాహ ఉధృతి ఉండే అవకాశం ఉండడంతో, అత్యధిక విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి జెన్ కో సిద్ధమయ్యింది.
 వానలతో పవర్ ఫుల్

కృష్ణా నదికి వరద పోటెత్తుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని హైడల్ పవర్ స్టేషన్లలో గరిష్ట విద్యుత్ ఉత్పత్తి చేయాలని తెలంగాణ జెన్ కో నిర్ణయించింది. ఇప్పటికే జూరాల, శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించిన జెన్ కో నాగార్జున సాగర్, పులిచింతలలో విద్యుత్ ఉత్పత్తి కోసం వ్యవస్థలను సిద్ధం చేసింది.. కృష్ణా నదిలో నీటి ప్రవాహ ఉధృతిని, రిజర్వాయర్లలో నీటి మట్టాలను సమీక్షించారు.వారం రోజుల క్రితం కర్ణాటక నుంచి నీటి ప్రవాహం ప్రారంభమయిన నాటి నుంచే జూరాలలో విద్యుత్ ఉత్పత్తిని జెన్ కో ప్రారంభించింది. కర్ణాటకకు బదులు పద్దతిలో 200 మెగావాట్ల విద్యుత్ అందిస్తూ వచ్చింది. ప్రస్తుతం కృష్ణాలో నీటి ప్రవాహ ఉధృతి చాలా ఎక్కువ ఉండడంతో జూరాలలో విద్యుత్ ఉత్పత్తి పూర్తి సామర్థ్యంతో చేయడం సాధ్యం కావడం లేదు. అప్పర్, లోయర్ జూరాల కలిపి 120 మెగావాట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నది. ప్రవాహ ఉధృతిని అనుసరించి, విద్యుత్ ఉత్పత్తి చేయాలని, ప్రతీ రోజు, ప్రతీ గంటా అప్రమత్తంగా ఉండి, ఆ సమయానికి కావాల్సిన వ్యూహం అనుసరించాలని జూరాల విద్యుత్ ప్లాంట్ల అధికారులతో ప్రభాకర్ రావు చెప్పారు.శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తికి వాడుతున్న నీరు నాగార్జున సాగర్ లో ప్రవేశిస్తున్నది. దీంతో శుక్రవారం సాయంత్రం నాటికి నాగార్జున సాగర్ లో నీటి నిల్వ 234 టిఎంసిలకు చేరింది. శ్రీశైలం రిజర్వాయర్ రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉండడంతో, అక్కడ గేట్లు ఎత్తేయడం ఖాయం. దీంతో నాగార్జున సాగర్ కు వరద పోటెత్తుతుందని, ఆ సమయంలో నాగార్జున సాగర్ లో 815 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని జెన్ కో నిర్ణయించింది. నాగార్జున సాగర్ నుంచి కూడా నీరు విడుదలయితే పులిచింతలలో 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని జెన్ కో నిర్ణయించింది.జూరాల నుంచి పులిచింతల వరకు అన్ని జల విద్యుత్ కేంద్రాల్లో ఒకేసారి పూర్తి సామర్థ్యం మేరకు జల విద్యుత్ ఉత్పత్తి చేయడం ఇటీవల కాలంలో సాధ్యం కావడం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా కృష్ణా నదిలో నీటి ప్రవాహం తగ్గుతూ వస్తుండడమే ఇందుకు కారణం. అయితే ఈ సారి కృష్ణా నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో, దీన్ని సానుకూలాంశంగా స్వీకరించి, అన్ని జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి చేయడానికి జెన్ కో సర్వసన్నద్ధమయింది.

No comments:

Post a Comment