Breaking News

09/08/2019

బహిరంగ వేలానికి రాజీవ్ స్వగృహప్లాట్స్

హైద్రాబాద్, ఆగస్టు 9, (way2newstv.in)
 రాజీవ్ స్వగృహ ఫ్లాట్‌ల బహిరంగ వేలం పాటకు తెలంగాణ రాష్ట్ర రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ రంగం సిద్ధం చేస్తుంది. త్వరలో అధికారిక ప్రకటన విడుదల చేస్తారని సమాచారం. నగర శివారంలోని బండ్లగూడ, పోచారం టౌన్ షిప్‌ల పరిధిలోని అసంపూర్తి ఫ్లాట్ నిర్మాణాల, ఇతరత్రా మౌలిక వసతుల కల్పన పనులు తుది దశకు చెరాయి. బండ్లగూడ టౌన్ షిప్ పరిధిలో 1,931 ఫ్లాట్‌లు ,పోచారం టౌన్ షిప్ పరిధిలో1,470 ప్లాట్‌లను బహిరంగ వేలం పాట ద్వారా విక్రయిస్తారు. ఈ టౌన్ షిప్‌ల పరిధిలో డబుల్, త్రిబుల్ బెడ్ రూం ఫ్లాట్‌లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర పభుత్వం కేటాయించిన నిధులతో భవనాల సముదాయాలోని అసంపూర్తి ఫ్లాట్‌ల నిర్మాణాలతో పాటు టౌన్ షిప్ పరిసరాల్లో ప్రాథమిక-మౌలిక వసతుల కల్పన పనులు శరవేగంగా సాగుతున్నాయి. 
బహిరంగ వేలానికి రాజీవ్ స్వగృహప్లాట్స్

సిఎం.కెసిఆర్ అదేశాల మేర రాయితీ ధరల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తొలి ప్రాధాన్యత (ఫస్టు -కమ్- ఫస్టు) విధానంలో ఫ్లాట్‌లను కేటాయింపు చేయాలని భావిస్తున్నారు. అలాగే కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగులకు కూడా ప్రాధాన్యత కల్పించే విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారని కార్పొరేషన్ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.ఇందులో భాగంగా తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ అధికాక యంత్రాంగం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరించేందుకు కార్పొరేషన్ సైట్‌లో సమగ్రమైన సమాచారం అందుబాటులోకి తెస్తున్నారు. బండ్లగూడ టౌన్‌షిప్ పరిధిలో 1,900 ఫ్లాట్‌ల నిర్మాణాలను పూర్తి చేయగా, 1.700 ఫ్లాట్ నిర్మాణల పనులు తుది దశలో ఉన్నాయి. అయితే ఈ టౌన్ పరిధిలోని 2,746 ఫ్లాట్‌లకు గాను ఇప్పటికే 506 ఫ్లాట్‌లను విక్రయించారు. మిగితా వాటిలో 309 ఫ్లాట్‌ల పరిధిలో నిర్మాణ పనులు పూర్తి చేయగా, 1,931 ఫ్లాట్‌లు విక్రయానికి సిద్దం చేస్తున్నారు. ఈ మేరకు కార్పోరేషన్ డబుల్ బెడ్ రూం, త్రిబుల్ బెడ్ రూం ధరలను కూడా ఖరారు చేయు దిశగా కసరత్తు చేస్తున్నారు. అత్యంత నాణ్యత ప్రమాణాలతో టౌన్‌షిప్‌ల పరిధిలోని పనులు నిర్వహిస్తున్నారు. అలాగే పోచారం టౌన్‌షిప్ పరిధిలో 1,700 ఫ్లాట్‌ల నిర్మాణాలు పూర్తి చేయగా, 1,500 ఫ్లాట్‌ల నిర్మాణాల పనులు తుది దశలో సాగుతున్నాయి. ఈ టౌన్‌షిప్ పరిధిలో 180 ఫ్లాట్‌లను విక్రయించగా, 1,470 ప్లాట్‌లు విక్రయానికి సిద్ధం చేస్తున్నారు.

No comments:

Post a Comment