Breaking News

23/08/2019

స్వప్నాన్ని సాకారం చేసేందుకు కేసీఆర్ పక్కా ప్రణాళికలు

హైదరాబద్ ఆగష్టు 23 (way2newstv.in - Swamy Naidu): 
తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వప్నాన్ని సాకారం చేసేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ సచివాలయాన్ని.. అసెంబ్లీని సరికొత్తగా నిర్మించేందుకు సారు ఎంతలా కలలు కంటున్నారో తెలిసిందే. తాను పోరాడి సాధించిన తెలంగాణలో తన హయాంలో తాను కట్టించిన సచివాలయం.. తాను కట్టించిన అసెంబ్లీలో పనులు జరుగుతుంటే చూడాలని తపిస్తున్న ఆయన.. ఆ దిశగా పక్కా ప్లాన్లు సిద్ధం చేస్తున్నారు.నిక్షేపంలా ఉన్న సచివాలయాన్నికూలుస్తారా?  వందల కోట్ల విలువైన భవనాల్ని కూల్చేసి మీరేం చేస్తారు?  ఇదెక్కడి దుర్మార్గం అంటూ గగ్గోలు పెడుతున్న గొంతుల్ని పక్కన పెట్టేసి.. తాను అనుకున్న పనిని పూర్తి చేసేందుకు వీలుగా కేసీఆర్ వ్యూహాల్ని సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. భారీ ఎత్తున ఉండే సచివాలయ భవనాల్ని ఎలా కట్టాలన్న దానిపై డిజైన్లను ఇప్పటికే సిద్ధం చేసినట్లుగా సమాచారం. 
స్వప్నాన్ని సాకారం చేసేందుకు కేసీఆర్ పక్కా ప్రణాళికలు
కట్టటం తర్వాత.. ఇప్పుడున్న కట్టడాల్ని ఎలా కూలుస్తారన్న అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.అయితే.. ఇందుకు మూడు ప్లాన్లు ఉండగా.. ఇందులో ఒక ప్లాన్ మీదనే సీఎం కేసీఆర్ ఆసక్తికరంగా ఉన్నట్లు చెబుతున్నారు. అట్టే శ్రమ లేకుండా.. కాస్త ఖర్చు ఎక్కువైనా సరే.. నిమిషం కంటే తక్కువ వ్యవధిలో మొత్తం కట్టడం పేక మేడలా కూలిపోయే ప్లాన్ కు ఓకే అన్నట్లుగా చెబుతున్నారు. సచివాలయంలోని బహుళ అంతస్తుల భవనాల్ని సింఫుల్ గా కూల్చేసేందుకు వీలుగా అత్యాధునిక సాంకేతికతను వినియోగించనున్నారు.ఇంప్లోజన్ విధానాన్ని అమలు చేయటం ద్వారా.. ఒక్కో భవనాన్ని కేవలం పావు నిమిషం కంటే తక్కువ వ్యవధిలోనే కూల్చేయనున్నారు. సంప్రదాయ పద్దతిలో.. భవనాన్ని కూల్చాలంటే నెలల తరబడి సమయం తీసుకుంటుంది. అందుకే.. ఆ సమస్య ఎదురుకాకుండా.. ఎక్ప్ ప్లోజన పద్దతిలో ఉండే శకలాలు వేగంగా దూరాన పడే తీరుకు భిన్నంగా.. ఉన్నచోటనే నేలమట్టం అయ్యేలా.. శకలాలు దూరాన పడకుండా ఉండే అత్యాధునిక సాంకేతికతను ఇందుకోసం వినియోగించనున్నారు. మరింత. లేటెస్ట్ టెక్నాలజీ అయినప్పుడుఖర్చు కాస్త ఎక్కువే. భవనాల కూల్చివేతకే రూ.10 కోట్లు ఖర్చు అవుతుందని లెక్క తేల్చారు. అంతేకాదు.. సచివాలయ భవనాల్ని ఎలా కూల్చనున్నారన్న విషయానికి సంబంధించి త్రీడీ ప్రజంటేషన్ ను సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. సారు కల సాకారం చేయటం కూడా భవనాల్ని కూల్చేందుకు రూ.10 కోట్లు ఖర్చు పెట్టాలనుకోవటం పెద్ద ఖర్చేం కాదులే.

No comments:

Post a Comment