Breaking News

13/08/2019

జైపూర్ లో పోలీసుల సోదాలు

మంచిర్యాల, ఆగస్టు 13, (way2newstv.in
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో డీసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో లో పోలీసుల కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని60 బైకు లతోపాటు ఒక కారు.5 ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డీసీపీ రవి కుమార్ మాట్లాడుతూ ఈ వాహనదారులు వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని సరైన పత్రాలు లేని వాహనాలను వాడకూడదని అటువంటి వాహనాలను వినియోగించిన వారు చట్టరీత్యా సమస్యలు ఎదుర్కొంటారని తెలుపుతూ ఈ ప్రాంతంలో లో కొత్త వ్యక్తులకు ఇల్లు కిరాయికి ఇచ్చేటప్పుడు ఆ వ్యక్తుల సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకొని ఇళ్లను ను అద్దెకు ఇవ్వాలని తెలుపుతూ 
జైపూర్ లో పోలీసుల సోదాలు

కొత్త వ్యక్తులు అపరిచితులు అనుమానం ఉన్న వ్యక్తులు కనబడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని మీ ప్రాంతంలో లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని అని దానికి ఎప్పుడు కూడా పోలీసుల సహకారం ఉంటుందని తెలిపారు జైపూర్ గ్రామం ప్రజలకు డీసీపీ కి తమ సమస్యలు వివరించారు. తమ ప్రాంతంలో లో అనేక సమస్యలు ఉన్నాయని ఈ ప్రాంతంలో లో ఆకతాయిల ఆగడాలు పెరిగిపోయాయని ఈ ప్రాంతంలో పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని అడిషనల్ సిపి నీ కోరారు వారి సమస్యలు విన్న డీసీపీ జైపూర్ ప్రాంతంలో పెట్రోలింగ్ ముమ్మరం చేస్తామని అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో లో డీసీపీ రవి కుమార్ తో పాటు ఏసిపి వెంకట్ రెడ్డి ముగ్గురు సీఐలు ఐదుగురు ఎస్ఐలతో పాటు 50 పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment