Breaking News

13/08/2019

ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్ కు హామీలు గుర్తుకు వస్తాయి: డీకే అరుణ

గద్వాల ఆగష్టు 13 (way2newstv.in
ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్ కు హామీలు గుర్తుకు వస్తాయని మాజీ మంత్రి డీకే అరుణ విమర్శించారు.డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని ఆశ చూపి ఓట్లు వెయించుకున్నారని తీరా అధికారం లోకి వచ్చాకాఅప్పుల తెలంగాణ గా రాష్ట్రాన్ని కేసీఆర్ అమర్చారని దుయ్యబట్టారు.రాష్ట్రంలో కేసీఆర్ అంత జూటగాడు ఇంకెవరూ లేరన్నారు.బీసీ హాస్టల్ ల పరిస్థితి దయనీయంగా ఉంది... కేసీఆర్ అధికారం లోకి వచ్చిన తరువాత ఒక హాస్టల్ కట్టలేదన్నారు.
ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్ కు హామీలు గుర్తుకు వస్తాయి: డీకే అరుణ

పేద కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మోడీ ప్రజల ఆకాంక్ష మేరకు పాలన చేస్తున్నారని అన్నారు.గద్వాల మున్సిపాల్టీ లో బీజేపీ గెలిస్తేనే అభివృద్ధి చెందుతుందన్నారు.కాశ్మీర్ కు స్వేచ్ఛ తెచ్చిన నరేంద్ర మోడీ.. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ తెస్తాడన్నారు.ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా సారథ్యంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు పోతుందన్నారు.తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ రావాలంటే తెలంగాణ లో బీజేపీ అధికారం లోకి రావాలన్నారు.కేంద్ర ప్రభుత్వం 2023 కల్లా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తుందన్నారు.మరో 25 సంవత్సరాలు దేశంలో బీజేపీ ప్రభుత్వమే ఉంటుందన్న ధీమా వ్యక్తం చేసారు.గద్వాల లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఈఅరుణమ్మ అండగా వుంటుదని అన్నారు.

No comments:

Post a Comment