Breaking News

13/08/2019

నెల్లూరులో ఉద్రిక్తత

నెల్లూరు, ఆగస్టు 13, (way2newstv.in
నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురంలో మంగళవారం మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనార్దన్ కాలనీలో అక్రమ నిర్మాణాలంటూ తెదేపా నేతలకు చెందిన మూడు ఇళ్లను కూల్చివేస్తున్నారు. పోలీసు బందోబస్తు మధ్య తెల్లవారుజాము నుంచి రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కూల్చివేత ప్రక్రియ చేపట్టారు. 
 నెల్లూరులో ఉద్రిక్తత

ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టారని అధికారులు చెబుతుండగా.. తాము సరైన పత్రాలతోనే స్థలం కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించామని తెదేపా నేతలు అంటున్నారు. తెదేపా నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని ఐదవ నగర పోలీసు స్టేషన్ కు తరలించారు. ఇదంతా వైకాపా సర్కారు కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. మూడు రోజుల క్రితమే నిర్మాణాల కూల్చివేతకు రెవెన్యూ అధికారులు రాగా..భాధితుల అభ్యంతరాలతో వెనుదిరిగారు. ఈ తెల్లవారుజామునే మళ్లీ వచ్చి పని కానిచ్చారు.

No comments:

Post a Comment