Breaking News

24/08/2019

చిదంబరం కష్టాలే..కష్టాలు

చెన్నై, ఆగస్టు 24, (way2newstv.in)
చిదంబరం గ్రేట్ లాయర్. అంతకు మించి గ్రేట్ లీడర్. చక్రాలు తిప్పడంతో సిద్ధహస్తుడు. మాస్ పాలిటిక్స్ చేయడం రాదు కానీ క్లాస్ పాలిటిక్స్ లో ఆయనే సాటి. సోనియాగాంధీకి నమ్మిన బంటులా ఉంటూ పదేళ్ళ యూపీయే పాలనలో కీలకమయ్యారు. తాను ఆడింది ఆటగా, పాడింది పాటగా హవా చలాయించారు. అటువంటి చిద్దూ ఇపుడు రాజకీయ జీవన సంధ్యా సమయంలో పెను విషాదంలో పడిపోయారు. పడమరకు వయసు చూస్తున్న వేళ ఆయనకు జీవిత కాలం మచ్చగా మిగిలిపోయేలా కేసులు తగులుకున్నాయి. అరెస్ట్ ముచ్చటా తీరిపోయింది. చిదంబరం వ్యూహకర్తగా పేరు. లాయర్ గా మేధవితనం కూడా జాస్తి. తమిళనాటి నుంచి వెళ్ళి హస్తిన రాజకీయాన్ని వంటబట్టించుకున్న ఈ నాయకుడు జాతీయ స్థాయిలో ఎంతో వెలుగు వెలిగారు. ఎన్నో ఎత్తులు కూడా చూశారు. పగ ప్రతికారాలకు చిదంబరం మారు పేరు అంటారు. 
చిదంబరం కష్టాలే..కష్టాలు

ఆయన హయాంలో సీబీఐ ని అడ్డం పెట్టుకుని చేసినన్ని దాడులు మరే పాలనలోనూ లేవని చెబుతారు. ఏపీలో జగన్ ని ముప్పతిప్పలు పెట్టడంలో చిద్దూ పాత్ర గణనీయమని అంటారు.అంతేనా ఉమ్మడి ఏపీ నుంచి ఆంధ్రప్రదేశ్ ని విడగొట్టేవరకూ చిదంబరం నిద్రపోలేదని కూడా విమర్శలు ఉన్నాయి. అన్నింటా తమిళనాడుతో ఉమ్మడి ఏపీ పోటీ పడుతోందన్న ఒకే ఒక కారణంతో అక్కసు పెంచుకుని మరీ చిద్దూ ఇలా అడ్డగోలు విభజనకు నాంది పలికారని చెబుతూఅరు. 2009 డిసెంబర్ 9న సోనియా పుట్టిన రోజున ఉమ్మడి ఏపీ రెండుగా విడగొడుతూ చిదంబరం చేసిన ప్రకటన, ఆయన చూపించిన అతి ఉత్సాహం ఏపీలో మంటలు పెట్టాయి. ఈ లోగా చిదంబరం రగిలించిన మంటల్లో ఎంతో మంది యువత బలైపోయిన దానికి బాధ్యత ఎవరు వహించాలి. అతి సున్నితమైన అంశంపై ఉన్నఫళంగా రెచ్చగొట్టే విధమైన ప్రకటన చేసి తన లెక్కలేనితనాన్ని దేశానికి హోం మంత్రిగా నాడు చిదంబరం చాటుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. చివరికి ఆయన అనుకున్నట్లుగానే 2014 ఫిబ్రవరిలో ఏపీ రెండు ముక్కలు అయింది.ఇక చిదంబరం ఆర్ధిక మంత్రిగా ఉన్న టైంలో చేసిన స్కాముల ఫలితమే ఈనాటికీ ఉట్టి కుడుపుతోందని కూడా అంటారు ఆ స్కాముల పాములు చిద్దూని వెంటాడి మరీ పగ తీర్చుకున్నాయని చెబుతారు. అన్నిటికీ మించి సోనియా వెనక ఉంది నాకేంటి అనుకుని ఆర్ధిక, హోం శాఖల్లో చిదంబరం చూపిన అతి చివరికి ఆయన్నిలా చేసిదని చెబుతారు. ఒకనాడు తాను దేశానికి హోం మంత్రిగా ఉంటూ ప్రారంభించిన సీబీఐ ఆఫీసులోనే చిదంబరం ఇపుడు నిందితుడిగా తల వంచుకుని కూర్చోవడం అంటే అంత కంటే రాజకీయ విషాదం వేరోకటి ఉండదేమో. గుజరాత్ లో ఓ మామూలు హోం మంత్రిని అరెస్ట్ చేయిస్తే తన గొప్ప అనుకున్నారు. అదే హోం మంత్రి ఈ రోజు దేశానికి హోం మంత్రిగా మారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేసరికి చిద్దూ కటకటాల వూచలు లెక్కబెట్టల్సివచ్చింది. ఓ విధంగా చిదంబరం జీవితం పొలిటికల్ లీడర్లకు గుణపాఠనేమని చెప్పాలి.

No comments:

Post a Comment